

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 16:

అర్జీ దారుల నుండి అందిన అర్జీలకు నూటికి నూరు శాతం నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లాస్థాయి అధికారులు ఆదేశించారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ రాజకుమారి, డ్వామా పిడి ఎస్ మధుసూదన్, ఏవో కాశి విశ్వేశ్వరరావు, ఎస్ డి సి కృష్ణమూర్తి, డి ఎల్ డి ఓ రాజేశ్వరరావులు అర్జీ దారుల నుండి సుమా రుగా 255 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు అర్జీదారుల సమస్యల పై సానుకూలంగా స్పందిస్తూ ప్రజాసమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కార మార్గాలు అందించాలని లేనిపక్షంలో ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో రీఓపెన్కు ఆస్కారం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు ప్రతి అర్జీని ప్రాథమికంగా క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారిస్తూ అర్జీదారు ని సంతృప్తే ధ్యేయంగా పరిష్కార మార్గాలను చూపాలని ఆయన స్పష్టం చేశారు.

పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. పీజీఆర్ఎస్లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువు లోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారు లపై ఉందన్నారు. అర్జీలు ఏ స్థాయిలోనూ పెండిoగ్ ఉండరాదన్నారు.అర్జీదారుల సమస్యను అధికారులు ఓపిగ్గా విని పరిష్కార మార్గాన్ని తెలపాల్సిన బాధ్యత ఉందన్నారు. సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని అర్జీదారులలో కలిగించాలన్నారు. అర్హతను పరిశించాలని, అనర్హత ఉంటే తగిన కారణాలను అర్జీదారునికి వివరిస్తూ ఎండార్స్మెంట్ కూడా ఇవ్వాలని ఆదేశించారు.

పరిష్కారమైన అర్జీదారులతో ఐవీఆర్ఎస్ ద్వారా ఉన్నతాధికారులు వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అవసరమైతే సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కారం ఉండాలన్నారు.

గడువు లోగా పరిష్కరించాల్సిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని, గడువు తీరిన అర్జీలు ఏ శాఖ లోనూ పెండిoగ్ ఉండరాదని జిల్లా కలెక్టర్ అన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ పిజిఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత శాఖల జిల్లా అధికారుల తో సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో పంచాయి తీరాజ్ ఎస్సీ పి రామకృ ష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ.సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి జిల్లా వ్యవసాయ అధి కారి బోసు బాబు, ఎల్ డి ఎం కేశవ వర్మ, ఏ ఎస్ ఓ శరత్, సహాయ పౌరసర ఫరాల మేనేజర్ నాగేశ్వర రావు, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.