

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 19:

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో సుమారు 70 వేలు ఎకరాలలో తెగుళ్లు సోకి రొయ్యల పంట దెబ్బ తిన్నదని వార్తలు పై స్పందించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రొయ్యల సాగులో తెగుళ్లు వ్యాప్తికి గల కారణాలను తెలుసుకునేందుకుగాను కాకినాడ స్టేట్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సి పాల్ , అదనపు సంచా లకులు ఎస్ అంజలి, మత్స్య శాఖ అధికా రులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ ఎ నోఫర్ సైటోజిన్ హీపట్ పినిఐ (E H P) వ్యాధి సంక్రమించిందన్నారు.

ఈ వ్యాధి హేచరీ నుండి పిల్లల ద్వారా గాని కలుషిత నీటి ద్వారా గాని సంక్రమిస్తుంద ని తెలిపారు. ఒకసారి ఈ వ్యాధి సంక్రమించినట్లయితే తద్వారా మొత్తం చెరువు లో రొయ్యలను ఆ యొక్క నీటిని పూర్తిగా తొలగించా లని చెరువును బాగా బీటలు వారేలా ఎండ పెట్టాలని ఆమె సూచిం చారు. కాలుష్యం ఆక్సైడ్ క్విక్ టైం లో హెక్టారుకు 6 టన్నులు చెరువులలో చల్లాలన్నారు తద్వారా అధిక క్షారత్వo వలన ఆ క్రిమి కీటకాలు నశిస్తాయని ఆమె వెల్లడించారు ఆ తదుపరి ఫ్రెష్ వాటర్ తో వారం రోజులు ఉంచి క్షారత్వాన్ని తటస్థీకరణ చేయాలన్నారు. తదుపరి ఫ్రెష్ వాటర్ తో రొయ్య పిల్లలను చెరువులో వద లాలన్నారు. ఈ వ్యాధి నిర్ధారణ కై చెరువులో మేత తొట్టెలను లోనికి వచ్చే రొయ్య పిల్లలను పరిశీలిం చినప్పుడు అన్ని ఒకే సైజులో కాకుండా వేర్వేరు సైజులలో ఉంటాయని దీనిని బట్టి అనుమానించి నిర్ధారణ కొరకు పిసిఆర్ పరీక్షలు చేయించి విష యాన్ని గమనించి రైతులు మత్స్య శాఖ అధికారులను సంప్రదించినట్లయితే సదరు చెరువులలో మట్టి నీటి రొయ్యల నమూనాలను సేకరించి కాకినాడ ఎస్ ఐ ఎఫ్ టి ప్రయోగశాలకు పంపించి ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అంది స్తారన్నారు ఈ నివారణ చర్యలను సాధ్యమై నంత వరకు క్యాంపై నింగ్ మోడ్లో అందిస్తే నివారణ చర్యలను బలోపేతం చేయడం జరు గుతుందన్నారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో ఈ వ్యాధిని నివారణ కొరకు ల్యాబ్లను బలోపేతం చేయడం, రొయ్యల సాగు పట్ల అనుభవం గల శాస్త్రజ్ఞులను సలహాలను పరిగణనలో తీసుకోవడానికి మత్స్యశాఖ అధి కారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు త్వరితగతిన చర్యలు తీసుకుంటూ రొయ్యల సాగులో నష్టాలను అధిగమిం చేందుకు లేదా తగ్గిం చేందుకు గల అవ కాశాలపై అధ్యయనం చేయా లని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి పీవీ శ్రీనివాస రావు సహాయ సంచాలకులు వర్ధన్, సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు.