ఈవీఎంల గోదాము ను తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం, ఫిబ్రవరి 28, 2025

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ బి ఆర్ ఎ జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఈవీఎంల భద్రపరచిన గోదామును అధికారులతో కలిసి పరిశీలించారు. నెలవారి తనిఖీలో భాగంగా గోదాము సీళ్ళను తనిఖీ చేసి రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు.

భారత ఎన్నికల సంఘం మార్గ నిర్దేశాల మేరకు నెలకోసారి ఈవీఎం ల గోదామును తనిఖీ చేయడం జరుగుతుందని.. ప్రతి మూడు నెలలకోసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం ల గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుందని డిఆర్ఓ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డి టి శివరాజ్ ముమ్మిడివరం డిప్యూటీ తాసిల్దార్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

కోడిపందాలు గుండాట పై ఉక్కు పాదం:ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ

కోడిపందాలు గుండాట మరియు రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతులు లేవని ఎవరైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అయినవిల్లి మండలం ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ హెచ్చరించారు.శనివారం ఆమె అయినవిల్లి పోలీస్ అధికారి మరియు రెవెన్యూ […]

నేడు ఆంధ్ర లో భారీ వర్షాలు

శుక్రవారం ఆ జిల్లాలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నేడు(శుక్రవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, […]

రైతులకు సహకార బ్యాంక్ రుణాలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం డిసెంబర్ 20: జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న వివిధ పంటల రాబడిలో 60 శాతం రుణాన్ని పొందే విధంగా రుణపరిమితులను నిర్ధారించాలని జిల్లా […]

యువతను నమ్మించి వెన్నుపోటు పొడిచింది జగనే : నక్క సునీల్

విద్యార్థులను,యువతను నమ్మించి వెన్నుపోటు పొడిచింది జగనే : టీ.ఎన్. ఎస్. ఎఫ్.రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం జూన్ 04: దేశ చరిత్రలో […]