V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 16:

క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో క్రీడా స్ఫూర్తితో ప్రపంచ స్థాయిలో రాణించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు క్రీడాకారులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక జి ఎం సి బాలయోగి స్టేడియం నందు వార్షిక వేసవి శిక్షణ శిబిరాలు – 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన సంబంధించిన క్రీడా పరికరాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి అమ్ముడ చైర్మన్ అల్లాడి స్వామి నాయు డులు క్రీడాకారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా క్రీడల పట్ల ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ యువతకు భరోసాగా నిలుస్తోందని యొక్క అవకాశాలను సద్విని యోగం చేసుకుని క్రీడా రంగాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు. క్రీడాకారులు క్రీడల పట్ల స్ఫూర్తిని ఆసక్తిని పొంది పలువురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు ఎస్ యానాo బీచ్ నందు అంతర్జాతీయ నమూనా కొలతలతో క్రికెట్ స్టేడియం ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ స్టేడియం నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు భవిష్యత్తులో అనేక రకాల ఈవెంట్లను జిల్లాలో నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు ఇటీవల ఎస్ యానం బీచ్ లో మహిళ వాలీబాల్ పోటీలను జాతీయస్థాయిలో నిర్వహించా మన్నారు.

జిల్లాలో అన్ని క్రీడా అంశాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ జాతీయ స్థాయి క్రీడా కారులను తీర్చిదిద్దేలా ముందుకు వెళతామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యం లోవార్షిక వేసవి శిక్షణ శిబిరాలు 2025 ఈనెల ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు 8 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు 50 చోట్ల శిక్షణ శిబిరాల ను వ్యాయామ ఉపాధ్యా యుల సమన్వయంతో నిర్వహించడం జరుగుతోందన్నారు 19 క్రీడాంశాలలో జిల్లాలో ఆదరణ అవసరమైన క్రీడలకు సంబంధించిన శిబిరాలను నడుస్తున్నాయన్నారు.

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 50 శిక్షణ శిబిరాలను జిల్లాకు మంజూరు చేస్తూ ఒక్కొక్క క్రీడా శిక్షణ శిబిరానికి రూ 7 వేలు లను కేటాయించగా వీటిలో క్రీడా పరికరాలు సమకూర్చుటకు రూ 5 వేలు, గౌరవ వేతనంగా రూ 1500లు, ఇతర ఖర్చులకు రూ 500లు కేటాయించారన్నారు. ఈ శిబిరాలను శిక్షకులతో త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

క్రీడాంశాల ద్వారా మానసిక ప్రశాంతత శారీర దారుఢ్యం ఉల్లాసాన్ని పొందడంతో పాటు మంచి క్రీడా స్ఫూర్తితో ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆమె ఆకాంక్షించారు చివరిగా శిక్షణా శిబిరాలకు క్రీడా పరికరాలను వారి చేతుల మీదుగా బహుకరించా రు. ఈ కార్యక్రమంలో అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు పిఎస్ సురేష్ కుమార్ వ్యాయా మ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.