
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఫిబ్రవరి 25 :

అమలాపురంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 14 మంది పిల్లల అస్వస్థతకు గురరై ఏరియా ఆసుపత్రి పాలయ్యారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం చల్లపల్లి గ్రామపంచాయతీ పరిధి జగ్గరాయిపేట ఎంపీపీ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు (రాగి జావ) తిన్నా ఆహారం విషముగా మారటం (ఫుడ్ పాయిజనింగ్) వల్ల వారంతాఅమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పర్యవేక్షణలో డాక్టర్ల బృందం వారికి వైద్యం అందించారు.

పరీక్షలు అనంతరం ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ,ఆర్డీవో లు హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసి కారకులు పై తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థి తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించారు.