రాజమహేంద్రవరం-జొన్నాడ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం జూలై 08:

జొన్నాడ హైవే గుత్తేదారు సంస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీ

పనుల పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గట్కరీతో మాట్లాడుతా : ఎంపీ హరీష్ బాలయోగి

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం -రాజమహేంద్రవరం-జొన్నాడ హైవే పనులపై సంబంధిత హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు జొన్నాడ ఫ్లై ఓవర్ గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో అమలాపురంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ గంటి హరీష్ బాలయోగి సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని మోరంపూడి ఫ్లై ఓవర్ ను అసంపూర్తిగా వదిలేశారని,జొన్నాడ ఫ్లై ఓవర్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని గుత్తేదారు సంస్థపై ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే రాజమహేంద్రవరం ప్రాజెక్ట్ డైరెక్టర్ హరీష్ చెప్పారు. ఈ నెలాఖరుకి ఫ్లై ఓవర్ గట్టర్లు పూర్తిచేస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధి తెలిపారు.అలాగే జొన్నాడ ఫ్లై ఓవర్ డిసెంబర్ నెలాఖరుకి పూర్తి చేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఈ వారంలో కేంద్రమంత్రి నితిన్ గట్కారితో సమావేశం అవుతానని సదరు గుత్తేదారు సంస్థ చేస్తున్న మోరంపూడి,తణుకు,ఉండ్రాజవరం,జొన్నాడ తదితర ఫ్లై ఓవర్ ల నిర్మాణ పనుల జాప్యంపై చర్చిస్తానని చెప్పారు.

ప్రస్తుత హైవే పనులపై దృష్టి…

ప్రస్తుతం నేషనల్ హైవే పై జరుగుతున్న పనులపై దృష్టి ఎంపీ దృష్టి సారించి పనుల పురోగతిని హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు.మడికి సెంటర్,చెముడులంక జంక్షన్ లో సర్వీస్ రోడ్డు నిర్మాణం అగ్రిమెంట్ దశలో ఉందని,చొప్పెల్ల జంక్షన్ వద్ద అభివృద్ధి పూర్తి చేసినట్లు తెలిపారు.చొప్పెల్ల లాకుల జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు అగ్రిమెంట్ దశలో ఉందని,మూలస్థానం వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు పూర్తి చేసినట్లు చెప్పారు.జొన్నాడ ఆంజనేయ స్వామి గుడి వద్ద సోలార్ లైట్ల నిర్మాణానికి టెండరు దశలో ఉన్నాయని చెప్పారు.జొన్నాడ ర్యాంపు జంక్షన్ ను అభివృద్ధి చేశామని,రావులపాలెం ప్రభుత్వ కాలేజీ వద్ద సర్వీస్ రోడ్డు అగ్రిమెంట్ దశలో ఉందని,రావులపాలెం సెంటర్ లో సర్వీస్ రోడ్డు హైవే లైట్ లు నిర్మించామని తెలిపారు.అలాగే మల్లాయిదొడ్డి సెంటర్ లో సోలార్ లైట్ ల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు,ఈతకోట సెంటర్,గోపాలపురం సెంటర్ లలో సోలార్ లైట్ ల నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ఎంపీ హరీష్ కు వివరించారు.

Related Articles

సామాన్య ప్రజలు తల రాతలు మార్చే శక్తి ఓటు హక్కుకు మాత్రమే: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 25: భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలక భూమిక పోషిస్తాయని ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు అని డాక్టర్ బి […]

తాసిల్దార్,సచివాలయ,కార్యాలయం/ తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అంబాజీపేట జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల పురోగతి,ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని డాక్టర్ బి […]

ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతీశీ

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత అతీశీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. […]