ఏసుక్రీస్తు బోధలు అందరూ ఆచరించాలి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 24:ఏసుక్రీస్తు అందించిన శాంతి, ప్రేమ,దయ, ఐక మత్యం సందేశాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ సమావేశం నందు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో జిల్లా సెమీ క్రిస్మస్ హై టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత పెద్దలు అభీష్టానికి అనుగుణంగా వివాహ లైసెన్సుల సమస్యలు పరిష్కారానికి కమ్యూనిటీ హాల్, మందిరాలు నిర్మాణా నికి ప్రభుత్వ స్థలాల ఎంపికకు తగిన సహకారం అందిస్తానని తెలిపారు క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని, ఏసుక్రీస్తు అందించిన శాంతి, ప్రేమ, దయ, ఐకమత్యం సందేశాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలన్నారు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమతో ఆదరించాలన్నారు. ప్రేమ కరుణ శాంతికి ప్రతిరూపం క్రిస్మస్ అన్నారు. ప్రపం చవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పర్వదినం క్రిస్మస్ అన్నారు. దైవ కుమారుడి త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఏసుక్రీస్తు చూపిన ప్రేమ అనురాగం ప్రజలు మనుగడ జీవనశైలిని మార్చేసాయ న్నారున్నారు యేసుక్రీస్తు జన్మదిన వేడు కలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు లోక రక్షకుడైన యేసు ప్రభువు అందరికి చల్లని దీవెనలు అందించాలని ఆకాంక్షించారు క్రీస్తు బోధ నలు సర్వ మాన వాళికి ఆచరణీయమన్నారు.

క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు నెలకొనా లని ఆకాంక్షించారు. ఈ సంద ర్భంగా క్రైస్తవ సోదరులకు ఆయన క్రిస్టమస్ శుభా కాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు, చిన్నారుల కు పంచిపెట్టారు. కొవ్వొ త్తు వెలిగించి క్రిస్మస్ శుభా కాంక్షలు చెప్పారు. పలువురు చిన్నారులు వేషధారణలతో అలరిం చారు. తొలుత రెవరెండ్ నున్న ప్రభు కుమార్ ఎం ఓ శివ, వై పరంజ్యోతి, ఇమ్మాను యేల్ పాస్టర్లు క్రీస్తు జన్మ విశిష్టత, బోధనలు, క్రిస్మస్ పండుగ గురించి తెలియ జేశారు. బైబిలు గ్రంథ పఠనం చేశారు. ఏసుప్రభువు జన్మదిన వృత్తాంతాన్ని తెలిపే చక్కని నృత్య గేయాలు, ప్రార్ధనలు, గీతాలు ఆలపిం చారు. అధికారులకు ఆశీర్వచ నాలు పలికారు. ఈ కార్యక్ర మంలో మైనారిటీ సంక్షేమ అధికారి ఎం సునీల్ కుమార్, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ సిబ్బంది విద్యార్థిని విద్యా ర్థులు పాస్టర్లు తదితరు లు పాల్గొన్నారు.

Related Articles

ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కను అందించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి

V9ప్రజా ఆయుధం రామచంద్రపురం , డిసెంబర్16,2024: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి కి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

స్వర్ణాంధ్ర- స్వచ్ఛఆంధ్ర- సైకిల్ పై కలెక్టర్- మహేష్ ఎమ్మెల్యే ఆనందరావు లు ర్యాలీ

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా (నేడు) మూడో శనివారం స్వచ్ఛ మైన గాలి ఇతివృత్త […]

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుకలిసిన అమలాపురం వెంకన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూన్ 17: మాజీ ముఖ్యమంత్రి మరియు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మంగళవారం తాడేపల్లిలో డాక్టర్ బి ఆర్ […]

సృజనాత్మకతను వెలికి తీసినప్పుడేవిద్యార్థులకుఉజ్వల భవిష్యత్తు సాధ్యం: ఎమ్మెల్యే గిడ్డి

పి.గన్నవరంలో సైన్స్ ప్రదర్శన కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం జనవరి 04: విద్యార్థినీ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసిన ప్పుడే […]