
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం ఫిబ్రవరి24:అమలాపురం పట్టణం నవీన్ సెల్ పాయింట్ నందు వివో V 50 మొబైల్ లాంచ్ అయింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం పట్టణంలో బహుమందికి పరిచయమైన నవీన్ సెల్ పాయింట్ (గడియార స్తంభం సెంటర్) నందు సోమవారం వివో V 50 మొబైల్ ఫోన్ ను వివో డీలర్ మరియు నవీన్ సెల్ పాయింట్ డైరెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో V9 మీడియా ప్రతినిధి వినయ్ కుమార్ చేతులు మీదుగా మొదటి మొబైల్ ఫోన్ కొనుగోలుదారులు సోషల్ వర్కర్ రాజేంద్రప్రసాద్ కు అందించారు.ఈ సందర్భంగా వివో కంపెనీ సాంప్రదాయ ప్రకారం వివో కేకును కోసి రాజేంద్రప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. సివిల్ స్కోర్ ఆధారంగా సామ్ సాంగ్ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా వివో V50 లేటెస్ట్ మొబైల్ ఫోన్ ను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ… కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అవసరంగా మారింది అన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా చెడును విసర్జించి మంచిని ఆస్వాదించాలిన్నారు. భవిష్యత్తులో కోనసీమ అంతటా నవీన్ సెల్ పాయింట్ సేవలు విస్తరించాలని వినయ్ కోరుతూ.. రాజేంద్రప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ సెల్ పాయింట్ ఎంప్లాయిస్ మరియు కస్టమర్స్ పాల్గొన్నారు.