నిరుపేదలకు వైద్యం అందించటమే కోనసీమ కేర్ హాస్పిటల్ లక్ష్యం: డాక్టర్ కారెం రవితేజ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఉప్పలగుప్తం డిసెంబర్ 30

నిరుపేదలకు వైద్యం అందించడం కోసం మే అమలాపురంలో కోనసీమ కేర్ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని చల్లపల్లి గ్రామంలో డాక్టర్ కారెం రవితేజ పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలో సోమవారం డాక్టర్ రవితేజ కు ఘన సన్మానం జరిగించారు. నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన సేవలను గుర్తిస్తూ చల్లపల్లి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు సన్మాన సభ ఏర్పాటు చేశారు. డాక్టర్ రవితేజ ను అభినందిస్తూ. బుద్ధుడు అంబేద్కర్ చిత్రపటం ను బహుకరించి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ రవితేజ మాట్లాడుతూ నిరుపేదలకు మేలు అయిన వైద్యం అందించటమే కోనసీమ కేర్ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం అన్నారు.


ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బడుగు శ్రీనివాస్, కాట్రు ఆనంద్, బూసి బుజ్జి దొర, కుసుమే వెంకన్న, కొల్లి భగవాన్ దాస్, కొల్లి పెద్దిరాజు, మరియు చల్లపల్లి గ్రామంలో ఉన్న 12 దళితపేట పెద్దలు, మరియు అంబేద్కర్ యువజన సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

అమలాపురం క్రీడోత్సవ ముగింపు సభ బహుమతులు ప్రదానం వారికే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 23: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 7,8,9 తరగతుల చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కోనసీమ క్రీడోత్సవాలు ఆటలతో […]

శానపల్లిలంక గ్రామంలో బోరున విలపిస్తున్న దళిత కుటుంబం

చంద్రబాబు పవన్ కళ్యాణ్ గార్లు నా కుటుంబానికి న్యాయం చేయండి: నక్క వెంకట్రావు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 24:చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ […]

చించినాడ బ్రిడ్జి పై రాకపోకలు బంద్ /1995 సంవత్సరంలో నిర్మించారు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం,జూలై 24: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామం – దిండి గ్రామం, మల్కిపురం మండలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతంగా జరగాలి: అమలాపురం RDO

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 26: పట్టభద్రుల శాసన మండలి పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతం, సజావుగా నిర్వహించాలని స్థానిక డాక్టర్ బి ఆర్ […]