
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 10:

సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణం నందు సంక్రాంతి పండుగను పురస్కరిం చుకుని ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఉద్యోగులతో అంగరంగ వైభవంగా భోగి మంటలు రంగవల్లులు ముగ్గులు వేసి టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజానీకానికి జిల్లా కలెక్టర్ ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణాన్ని తెలుగుదనంతో సంక్రాంతి శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని, ఎల్లప్పుడూ సుఖ, సంతోషాలతో జీవించాల ని, ప్రజానీకం అందరూ సుభిక్షంగా, ఆయురా రోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజానీకానికి మరొక మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిందన్నా రు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి ప్రసంగిస్తూ.. తెలుగువారు జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశి ష్టమైన చరిత్ర ఉందన్నారు. మన సాంస్కృతీ సంప్ర దాయాలను, ప్రతి ఒక్కరు పాటిస్తూ గౌరవించాలన్నారు హిందువులు జరుపుకునే సాంప్రదాయ పండుగ సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు అన్ని పండుగలు తిధి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్య గమనం ఆధారంగా జరు పుకునే పండుగని ఆమె తెలిపారు. తెలుగువారి అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా సంక్రాంతి పండుగ ప్రాచుర్యం పొందిందన్నారు. పంటల సమృద్ధిగా పండి ఉత్పత్తులు చేతికి అందిన సందర్భంగా ఎంతో ఆనందో త్సవాలతో ఈ పండుగను బంధుమిత్రులతో సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టే రీతిలో అత్యంత వైభవపే తంగా నిర్వహించుకోవా లన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణమన్నారు. మకర సంక్రమణo నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందన్నారు.

సంక్రాంతి పండుగ మన కలెక్టరేట్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ జిల్లాలో సంక్రాంతి పండుగ యొక్క ప్రాధాన్యతను కలెక్ట రేట్ పరిపాలన అధికారి కే కాశీ విశ్వేశ్వరరావు జిల్లా కలెక్టర్ వారికి వివరిస్తూ కోనసీమ ప్రాంతంలో కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించే సంక్రాంతి పండుగ మహో త్సవం ప్రభల ఊరేగింపు బాణ సంచా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగు తుందని,ఈ పండుగకు కోనసీమ వాసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు స్థానిక కలెక్టరేట్లో ప్రాంగణంలో సంక్రాంతి శోభ పండుగ ఏర్పాట్లు బాగు న్నాయని కలెక్టరేట్ పరిపాలన అధికారి కాశీ విశ్వేశ్వర రావు ను జిల్లా జాయింట్ కలెక్టర్ అభినం దించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ అధికారులకు ఇబ్బందికి టగ్ ఆఫ్ వార్ పోటీని వారు ప్రారం భించారు.టగ్ ఆఫ్ వార్ పోటీలో గెలిచిన వారికి మెమోంటో అందజేశారు. జిల్లా అధికారులకు కలెక్టరేట్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా సంక్రాంతి పండుగను కుటుం బ సమేతంగా జరుపుకోవా లని కోరుతూ అధికారులకు సిబ్బందికి జిల్లా కలెక్టర్ మిఠాయిలు పంచారు.

ఈ కార్యక్రమంలో, సివిల్ సప్లై డిఎం బాల సరస్వతి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి డిఎసి మెంబర్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కిషోర్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.