అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో యోగాంధ్రా/ పాల్గొన్న ఎంపీ హరీష్

యోగాంధ్రా తో ప్రపంచం చూపు ఆంధ్రా వైపు…

మార్క్ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్టా : ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 21:

175 దేశాలు మద్దతు తెలిపిన యోగాను యోగాంధ్రా తో ప్రపంచం చూపు ఆంధ్రా వైపు తిప్పేలా వైజాగ్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ శారీరక మరియు మానసిక ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని చెప్పారు.అందుకే ప్రపంచ దేశాలు యోగా వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు.దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగాంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.వైజాగ్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 గిన్నిస్ రికార్డు సృష్టించిందని ఒకే ప్రాంతంలో 3 లక్షల మంది ప్రజలు యోగాసనాలు వేసి గతంలో 1,47,952 మందితో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును బ్రేక్ చేసిన ఘనత మన రాష్ట్రానికి దక్కిందన్నారు.అలాగే విశాఖలో నిర్వహించిన యోగాంధ్రలో 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారని తెలిపారు.

ఈ విజయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.

Related Articles

ధాన్యం కొనుగోలు ప్రక్రియ|మార్కెట్ ను ప్రోత్సహిస్తూ… గిట్టుబాటు ధర

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 15: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆరుగాలం శ్రమించి పండించిన రైతులను అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ టార్గెట్ తోపాటు బహిరంగ […]

మద్దాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ అయినవిల్లి 19 ఫిబ్రవరి 2025: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.డాక్టర్ […]

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వకాలు జరగకూడదు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 3: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అక్రమంగా ఇసుక తరలింపు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా […]

డాక్టర్ రవితేజా కు నూతన సంవత్సర శుభాకాంక్షలు: తెలుగు నేత కృష్ణ

2025 నూతన సంవత్సరంను పురస్కరించుకుని బుధవారం అమలాపురం కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా కు లెక్చరర్ మరియు తెలుగు దేశం పార్టీ నేత పంబల కృష్ణ కలిసి కొత్త […]