జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయనగరం జనవరి 25:విజయనగరం జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లను జెసి సేతు మాధవన్ శనివారం సాయంత్రం పరిశీలించారు. పతాక ఆవిష్కరణ వేదిక, గ్రౌండ్, స్టాల్స్, శకటాల మార్గం, వీఐపీ గ్యాలరీ, ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. మార్పులు చేర్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా, లోటుపాట్లకు తావివ్వకుండా, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జేసి స్పష్టం చేశారు. ఆర్డీవో డి.కీర్తి, తాహసీల్దార్ కూర్మనాధరావు, ఇతర అధికారులు జాయింట్ కలెక్టర్ ఉన్నారు.