అమలాపురం ప్రజా వేదిక లో 218 అర్జీలు స్వీకరించిన కలెక్టర్స్ మరియు రెవిన్యూ అధికారులు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 6:

అర్జీదారుల వ్యక్తిగత, సామాజిక సమస్యలను సంతృప్తికర స్థాయిలో నాణ్యతతో పరిష్కరిస్తూ పీజిఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు జిల్లాస్థాయి మీకోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ టి,నిషాoతి,డిఆర్డిఏ ,డ్వామా ఐసిడిఎస్ బీడీలు శివశంకర ప్రసాద్, మధు సూదన్, ఝాన్సీరాణి లు అర్జీదారుల నుండి సుమా రుగా 218 స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న ఈ ప్రజా సమస్యల పరిష్కార వేది కలను ప్రజలు సద్విని యోగం చేసుకుంటూ తమ యొక్క సమస్యల ను పరిష్కరించుకోవాలన్నారు సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా ప్రజా సమ స్యల పరిష్కార వేదిక వెబ్ పోర్టల్ ను కూడా ప్రవేశపెట్టిందన్నారు.

మున్సిపల్ కార్యాలయా ల్లో, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల కార్యాలయాల్లో సంబం ధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిం చి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారిస్తూ పరిష్కార మా ర్గాలు చూపుతారన్నారు మండల స్థాయిలో పరి ష్కారమయ్యే అర్జీలను మండల స్థాయిలోనే సమర్పించాలని స్పష్టం చేశారు.దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారని. దాని ఆధారంగా నమో దిత ఫిర్యాదు ఏ దశ, స్థితిలో ఉందో తెలుసు కునే వెసులు బాటు ఉంటుందన్నారు. సార్వత్రిక ఫిర్యాదుల పరిష్కార హెల్ప్ లైన్ ద్వారా తమ సమస్యను నేరుగా తెలి యజేయ డానికి వీలు కల్పిస్తుంద న్నారు. ఫిర్యా దుదారు లు1902 కి కాల్ చేసి తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చ న్నారు. అధికారులు తమ లాగిన్ కు వచ్చిన సమస్యలను పూర్తి స్థాయిలో విచారించి సకాలంలో గడువులోగా పరిష్కార మార్గాలు పూర్తి నాణ్యతతో రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా నాణ్య తతో చూపాలని . గడువు దాటిన అర్జీలకు ఆస్కా రం లేకుండా అప్రమత్తం గా వ్యవహరించాలన్నారు.

అర్జీ పరిష్కారం కానీ పక్షంలో అర్జీదారులకు స్పష్టమైన కారణాలను తెలియ జేయాలన్నారు. ఏ శాఖకు సంబంధించిన సమస్య ఆ శాఖ యొక్క వెబ్ సైట్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు డీఈవో బోసు బాబు పిఆర్ ఎస్ ఈ, పి రామకృష్ణారెడ్డి జిల్లా విద్యా శాఖ అధి కారి షేక్ సలీం భాష జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ప్రసాద్ ఎల్ డి ఎం కేశవ వర్మ డిసిహె చ్ఎస్ కార్తీక్ రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ ఎం దుర్గా రావు దొర, డి ఐ పి ఆర్ ఓ కే లక్ష్మీనారాయణ వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

Indian Overseas Bank: 👉Indian Overseas Bank Recruitment Notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)ఉద్యోగాల భర్తీ. 👉మొత్తం ఖాళీలు: 750  ▪️ ఆంధ్రప్రదేశ్ – 9 ▪️తెలంగాణ – 16 👉అర్హత: అభ్యర్థులు […]

డిప్లమా ఐటిఐ నిరుద్యోగులకు మంచి అవకాశం 30 రేపే ఇంటర్వ్యూ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆలమూరు ఏప్రిల్ 29 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు లో స్థానిక కృష్ణ ప్రభాస్ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో […]

నిరుద్యోగులకు హోంలో ఉద్యోగాలు మంత్రి శుభవార్త

నిరుద్యోగులకు ఎపి హోంమంత్రి అనిత శుభవార్త చెప్పారు. పోలీసు, జైళ్లు, న్యాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా శాఖలు సమర్థంగా పని చేసేందుకు కావాల్సిన […]