G M C బాలయోగి స్టేడియం నందు ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 21:

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈనెల 26 వ తేదీన స్థానిక జి.ఎం.సీ బాల యోగి స్టేడియం నందు ఘనంగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధం కావాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి అధికా రులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారులతో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వివిధ విభాగాల అధికారులు సమన్వ యం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్య లు తీసుకోవాలన్నా రు. మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని సిద్ధం చేయాలని జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీస్ కవాతు, గౌరవ వందన స్వీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతలు పరిరక్షణ ఏర్పాట్లను పోలీసు విభాగం చేపట్టాలన్నారు. ప్రధాన వేదిక వద్ద ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియాకు సిట్టింగ్ ఏర్పాట్లు ఫ్రోటోకాల్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు మున్సిపల్ అధికారులు సమన్వ యంతో త్రాగునీటి సౌకర్యాలు పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలన్నా రు. . ట్రాన్స్కో అధికా రులు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు లైటింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నా రు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సాంస్కృతి కార్యక్రమాలు, ఎన్.సి.సి కార్యక్రమాలు కార్యచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. డిఐపిఆర్ఓ, సిపిఓ సహకారంతో జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికలను సిపిఓ ద్వారా సమీకరించుకుని ముఖ్య అతిధుల ప్రసంగ నివేదికను తయారు చేయాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,జిల్లా చేనేత జౌళి శాఖ, జిల్లా పంచాయతీ రాజ్ మరియు జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంయుక్తంగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 104 సంచార వైద్య సేవలు 108 అత్యవసర వైద్య సేవలు, విభాగానికి సంబంధించి ఇటీవల కాలంలో ఆయా శాఖలు చేపట్టిన సంక్షేమ అభి వృద్ధి పథకాల ప్రగతిని ప్రతిబింబించే రీతిలో శకటాలను రూపొందించి పోటీలు నిర్వహణకు సిద్ధపరచాలన్నారు. ప్రతి శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇచ్చే విధంగా జిల్లాస్థాయి అధికారులు జాబితాలు సిద్ధం చేయా లన్నారు. ఈ కార్యక్రమం లో డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి ఆర్డిఓ కె.మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర, మున్సిపల్ కమిషనర్ రాజు, డి ఐ పి ఆర్ ఓ కె.లక్ష్మీనారాయ ణ, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్, వివిధ శాఖల కు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related Articles

రాజోలు నియోజకవర్గంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

సీనియర్ మాజీ మంత్రి గొల్లపల్లి ఆధ్వర్యంలో వైసిపి అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – రాజోలు డిసెంబర్ 21;వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ […]

ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో సీఎం చంద్రబాబు పర్యటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం మే 29: ఈనెల మే 31 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటనవిజయవంతం […]

జిల్లా కోర్టు కై కృషిచేసిన పిల్లి మురళికి పేదలు రుణపడి ఉంటారు

•ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ముందడుగు•ఉచిత న్యాయ సలహాలు అందించిన న్యాయవాది పిల్లి మురళి మోహన్ వెంకటరమణ•ఎంతోమంది పేదలకు తక్కువ ఫీజుతో కేసుల నుంచి విముక్తిని ప్రసాదించారు. రామచంద్రపురం 18 డిసెంబర్, ప్రజా ఆయుధం ప్రతినిధి […]

బాణాసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు పై అధికారులు ఉక్కు పాదం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 9: బాణాసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు నిర్వహించే వారు ప్రజల భద్రత, పర్యావరణ పరి రక్షణ, చట్టపరమైన ప్రమాణాలు తప్పనిసరిగా […]