సీనియర్ మాజీ మంత్రి గొల్లపల్లి ఆధ్వర్యంలో వైసిపి అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక – రాజోలు డిసెంబర్ 21;వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్ మరియు సీనియర్ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో శనివారం మలికిపురం పార్టీ ఆఫీస్ నందు అభిమానులు కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రకటించిన విధముగా తొలిత మలికిపురం లో ఘనంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేదిక పై జగన్ మోహన్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నియోజకవర్గ పార్టీ నాయకులు సమక్షంలో కోసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.తదుపరి శీతాకాలం దృష్టిలో ఉంచుకుని చలికు ఉపయోగపడే దుప్పట్లను పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వారందరికీ రుచిగల భోజన పదార్థాలను అందించారు. అనంతరం ఉదయం నుండి సాయంత్రం వరకు స్థానిక నియోజకవర్గం పరిధిలో ఉన్న పలు గ్రామాలలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గొల్లపల్లి సూచన మేరకు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.