
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం మే 29:

ఈనెల మే 31 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటనవిజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి వర్యులు పర్యటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ప్రాంతీయ ఇంటిలిజెన్సీ అధికారి కృష్ణారావు, జిల్లాస్థాయి అధికారులతో కలిసి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజిన్ పర్యటన నిర్వహించారు.

ముందుగా సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో సత్తెమ్మ తల్లి గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలన చేశారు. తదుపరి చేయ్యేరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పూడికతీత పథకం ద్వారా సుమారుగా రూ 9 లక్షల 88 వేల అంచనా వ్యయం తో చేపట్టిన అభి వృద్ధి పనులను వారు పరిశీలించారు. స్థాని కంగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వేదిక ఏర్పాట్లను వారు పరిశీ లించారు. అనం తరం చెయ్యేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక బాగాన ఏర్పాటు చేసిన ప్రజావేదిక ను వారు పరిశీలించారు. తదుపరి సిహెచ్ గున్నేపల్లి గ్రామం లో సత్తెమ్మ తల్లి గుడి ప్రక్కన పార్టీ క్యాడర్ సమావేశ స్థలాన్ని పరిశీ లించారు.

ముఖ్యమంత్రివర్యుల పర్యటన వివరాలు:
ఈనెల 31వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్ర బాబు నాయుడు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి 12.25 నిమిషాలకు (రాజమండ్రి) మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని అక్కడనుండి హెలికాప్టర్లో బయలుదేరి 12.50 నిమిషాలకు సిహెచ్ గున్నే పల్లి చేరుకుంటారన్నారు.

హెలిప్యాడ్ వద్ద ప్రజా ప్రతినిధులను అధికా రులను కలిసి మధ్యా హ్నం1.05 నిమిషాలకు చెరువు పూడికతీత పనులను పరిశీలించి ప్రజలు ప్రజాప్రతిని ధులతో ముఖాముఖిగా మాట్లాడతారని తెలి పారు.1.20 నిమిషాల నుండి 2.05 నిమిషాల వరకు పేదల సేవలో ప్రోగ్రాంలో (పి4) బంగారు కుటుంబాలను మార్గద ర్శకులకు దత్తతను ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఎన్టీఆర్ భరోసా పింఛను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తారన్నారు . మధ్యాహ్నం 2.10 నిమిషాల నుండి 3.30 నిమిషాల వరకు సిహెచ్ గున్నేపల్లి గ్రామస్తులతో ముఖాముఖిగా చర్చలు జరుపుతారన్నారు.

3.35 నిమిషాల నుండి 5.05 నిమిషాల వరకు పార్టీ క్యాడర్ మీటింగుకు హాజరవుతారన్నారు. తదుపరి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఆర్డీవోలు డి అఖిల, ఏ మాధవి పి శ్రీకర్ డ్వామా పిడి మధుసూదన్, పి ఆర్ ,ఎస్ ఇ .పి రామకృ ష్ణారెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ, బి రాము జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.