•ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ముందడుగు
•ఉచిత న్యాయ సలహాలు అందించిన న్యాయవాది పిల్లి మురళి మోహన్ వెంకటరమణ
•ఎంతోమంది పేదలకు తక్కువ ఫీజుతో కేసుల నుంచి విముక్తిని ప్రసాదించారు.
రామచంద్రపురం 18 డిసెంబర్, ప్రజా ఆయుధం ప్రతినిధి ::రామచంద్రపురం పట్టణానికి అదనపు జిల్లా కోర్టు రావడానికి ఎనలేని కృషి సల్పిన రామచంద్రపురం కోర్టుల సమూహం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు అడ్వకేట్ పిల్లి మురళీమోహన్ వెంకట రమణ నేటి యువతకు ఆదర్శప్రాయుడని పలువురు వక్తలు ప్రశంసించారు. రామచంద్రపురం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం, అడ్వకేట్ పిల్లి మురళి అనునాయలు, సన్నిహితులు, మిత్రులు పట్టణంలో జిల్లా కోర్టు ఏర్పాటుకు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పిల్లి మురళి చేసిన కృషిని, సేవలను గుర్తించి ఆయనను ఘనంగా సన్మానించారు. బుధవారం స్థానిక బలుసు కళ్యాణ మండపంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది పిల్లి మురళిని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు దుస్సాలువా తోను, పూలమాలలతోనూ ఘనంగా సన్మానించారు. పట్టణ ప్రముఖులు మేడిశెట్టి శేషారావు రాయుడు చంద్రరావు, కడలి రాంపండు తదితరులు న్యాయవాద వృత్తిలో అడ్వకేట్ పిల్లి మురళీమోహన్ వెంకటరమణ చేసే సేవలను కొనియాడారు. అలాగే రామచంద్రపురం వాసుల చిరకాల స్వప్నమైన జిల్లా కోర్టు ఏర్పాటులో విశేషమైన కృషి చేసిన మురళీమోహన్ వెంకటరమణకు పేదలు రుణపడి ఉంటారని పలువురు వక్తలు కితాబిచ్చారు. ఆధ్యాత్మిక రంగంలోనూ, సేవా రంగంలోనూ ముందుండే వ్యక్తి మురళి అని పలువురు కీర్తించారు. పేదలకు ఏ విధమైన ఫీజులు తీసుకోకుండానే వారిని అనేక కేసుల నుంచి బయటపడేసారని అన్నారు. ఇలాంటి న్యాయవాదిని కన్న తల్లిదండ్రులు చాలా గొప్పవారు అని వక్తలు గుర్తు చేశారు.మురళి మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని వారంతా ఆకాంక్షించారు. ఈ సభలో రామచంద్రపురం లో నూతనంగా ఏర్పడిన నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇళ్ల శ్రీ నాగరాజును సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత న్యాయవాది పిల్లి మురళీమోహన్ వెంకటరమణ మాట్లాడారు. తన గురువైన మేడిశెట్టి శేషారావు, అలాగే న్యాయవాద గురువైన పూజ్యులు సీనియర్ అడ్వకేట్ బుచ్చిరాజు వారి నిర్దేశికత్వంలో తాను ఈ స్థాయికి వచ్చానని గర్వంగా తెలిపారు. తనపై ఉంచిన అభిమానానికి ఆహుతులు అందరికీ కృతజ్ఞతలని మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయశాఖ ఉద్యోగి దొమ్మేటి సుధాకర్ రావు, కట్టా సూర్యనారాయణ, వాసంశెట్టి శ్యామ్, కంచి సత్యానందం, భానోదయ స్కూల్ అధినేత వాసంశెట్టి లక్ష్మీనారాయణ, మేడిశెట్టి సూర్యనారాయణ, గుబ్బల సూరిబాబు, డాక్టర్ కొప్పిశెట్టి సత్యనారాయణ, చినబాబు, కె. సురేంద్ర త్రిపాటి తదితరులు పాల్గొన్నారు.