
V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా C E O నక్క చంద్ర మెహన్ (M A BED) గన్నవరపు శ్రీనివాసరావు కు శుభాకాంక్షలు తెలిపారు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి జనవరి 21:

అయినవిల్లి జడ్పిటిసి మరియు రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి గన్నవరపు శ్రీనివాసరావు కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం జడ్పిటిసి మరియు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గన్నవరపు శ్రీనివాసరావు కు స్థానిక పి గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త గా ఆ పార్టీ అధిష్టానం రెండు రోజులు క్రితం నియమించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలు పార్టీ గ్రామ శాఖలు ఆధ్వర్యంలో సిరి సత్కారాలతో అభినందించి గౌరవిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆయన స్వగృహం అయినవిల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామ ఎంపీటీసీ ప్రయాణంతో ఎమ్మెల్యే స్థాయికి చేరుకోవటం గొప్ప అభినందనీయం అన్నారు.



