బాణాసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు పై అధికారులు ఉక్కు పాదం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 9:

బాణాసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు నిర్వహించే వారు ప్రజల భద్రత, పర్యావరణ పరి రక్షణ, చట్టపరమైన ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని ఆర్డీవో కె మాధవి అన్నారు. గురువారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం డివిజన్ పరిధిలో బాణాసంచా విక్రయదారులు, తయారీ దారుల కేంద్రాలను చెక్ లిస్ట్ ప్రకారం తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు.

తొలుతగా అమలాపురంలో మూడు తయారీ కేంద్రాల ను రెండు విక్రయిదారుల గోదాములను స్థానిక మండల పరిధిలోని జనపల్లి లో ఆమె చెక్ లిస్ట్ ప్రకారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం జిల్లాలో రాయవరం మండలంలో జరిగిన బాణాసంచా విస్పోటనo సంఘటన దృష్ట్యా తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించియున్నారన్నారు.

ఆ మేరకు రెవెన్యూ, అగ్ని మాపక సంబంధిత శాఖలు నిరంతరం తనిఖీలు డివిజన్ వ్యాప్తంగా దశలవారీగా తని ఖీలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు బాణా సంచా తయారీ కేంద్రాలకు లైసెన్స్ తప్ప నిసరన్నారు. బాణాసంచా తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాద నివారణ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

అగ్ని నియంత్రణ పరికరాలు తప్పనిసరిగా ఉండాలన్నా రు. తయారీ ప్రాంతంలో శుభ్రత, నిల్వ గదుల మధ్య తగిన దూరం ఉండాల న్నా రు.పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు అందించాల న్నారు.కార్మికులకు రక్షణ భద్రత పై సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. దీపావళి వంటి పండుగలకు ముందుగా ప్రత్యేక అనుమతులు పొందాలన్నారు కాలుష్య నియంత్రణకు సంబం ధించిన అనుమ తులు పొందాలన్నారు.

బాణాసంచా నిల్వ గదులలో తగిన అగ్నిమాపక పరికరాలు అమర్చాలన్నారు. ఆవా సాలకు దూరంగా జన సంచారం తక్కువ గా ఉండే ప్రాంతాల్లో మాత్రమే వీటిని పెట్టడానికి అనుమతి ఉం టుందన్నారు.పోలీసు శాఖ వారు భద్రతా నియమాలు, లైసెన్స్ లేని తయారీని నిలుపుదల చేయాలన్నారు అగ్నిమాపక శాఖ అగ్నిప్రమాద నివారణ పరికరాల తనిఖీ చేశారన్నారు భూమి వినియో గం, లైసెన్సు పరిశీలన తాహసి ల్దార్లు పరిశీలించారన్నారు.

పర్యావరణానికి హానికరమైన పదార్థాల వాడకాన్ని నియంత్రించడం బాణా సంచా తయారీకి సంబంధిత సాంకేతిక ప్రమాణా లను తనిఖీ చేశారన్నారు లైసెన్స్ ప్రామాణికతను పరిశీలించారన్నారు.నిల్వ గదుల్లో పరిమితికి మించి పదార్థాలను నిల్వ ఉంచ రాదన్నారు.అప్రమత్తత పరికరాలైన అలారాలు, అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు.ప్రమాదాలు సంభవించి నప్పుడు అత్యవసర చర్యల ప్రణాళిక తప్పని సరిగా ఉండాలన్నారు.

తయారీ ప్రదేశంలో ధూమపానం, అగ్ని వాడకాన్ని నిషేధించాలన్నారు ప్రతి కేంద్రంలో కనీసం 2 అగ్నిమాపక సిలిండర్లు ఉండాలన్నారు.అన్ని ప్రవేశ ద్వారాలు బాగా గుర్తించ గలిగేలా ఏర్పాటు చేయా లన్నారు.నో ఎంట్రీ హైరిస్క్ ఏరియా వంటి సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయా లన్నారు.పని సమయాల్లో ఎమర్జెన్సీ మార్గాలు అందు బాటులో ఉండాలన్నారు.

జిల్లా యంత్రాంగం రూపొందించిన చెక్ లిస్ట్ ప్రకారం మొత్తం ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత ప్రాపర్ణాల్లో పరిశీలించిన పర్య వేక్షణ వివరాలు సమర్పించడం జరుగుతుంద న్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా అగ్నిమాపక విపత్తుల స్పందన అధికారి పార్థ సారథి, డి.ఎస్.పి ప్రసాద్, తాసిల్దార్ అశోక్ ప్రసాద్,సిఐ ప్రశాంత్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

కోనసీమలో 335 సమస్యలు //కలెక్టరేట్ లో ఆక్వా రైతులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 24: అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో నాణ్యతతో తగు పరిష్కార మార్గాలు రీఓపెన్కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని జిల్లా […]

చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభలో మాల కళాకారులు.

V9 ప్రజా ఆయుధం- గుంటూరు డిసెంబర్ 15:గుంటూరు నల్లపాడు లో ఆదివారం సాయంత్రం చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభ ప్రారంభమైంది. సభా వేదికపై మాల కళాకారులు మాలలను చైతన్య పరుస్తూ జానపద […]

ఆధార్ కార్డు అప్డేట్ కు మరోసారి గడువు పెంచిన కేంద్రం

ఆధార్ కార్డు అప్డేట్ కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. పదేళ్లకోసారి ఆధార్ అప్డేట్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆధార్ లో వివరాలను సమర్పించి.. అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. అప్డేడ్ గడువు […]

రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నియామకం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 26: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లామండపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను […]