
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -సికింద్రాబాద్ మార్చి 27:


ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు సికింద్రాబాద్ లో ఘనంగా జరిగాయి.

ప్రముఖ దైవజనులు ఇవాంజెలిస్ట్ మరియు సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓ పగడాల ప్రవీణ్ రెండు రోజుల క్రితం రాజమండ్రిలో అనుమానస్థితిలో మరణించిన విషయం తెలిసినదే. బుధవారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామ నిర్వహించి తదుపరి అయిన భౌతికకాయాన్ని తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ కు తరలించారు.

గురువారం ఆయన పార్థ దేహాన్ని సందర్శించడానికి వీలుగా సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణములో ఉంచారు. పాస్టర్ పురుషోత్తం అధ్యక్షతన లో వివిధ రాష్ట్రాల దూర ప్రాంతాల నుంచి క్రైస్తవ దైవ సేవకులు వివిధ సంఘ పెద్దలు పార్థిదేహాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని రక్షణ టీవీ చానెల్ అధినేత బెనహరి, సమక్షంలో లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

డాక్టర్ కే ఏ పాల్ ,రాజమండ్రి నుండి ఏసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ, రాజమండ్రి జేమ్స్, ప్రముఖ వక్త మరియు ముస్లిం అధికార ప్రతినిధి షఫీ , బెల్లంపల్లి కల్వరి స్వరం మినిస్ట్రీ ప్రవీణ్ దంపతులు,, జైపాల్ ఫౌండేషన్, చెన్నై నుండి రాజ్ ప్రకాష్ దంపతులు,జాన్ పాల్ కడప, కల్వరి టెంపుల్ మినిస్ట్రీస్ సభ్యులు, మన్నా మినిస్ట్రీస్ స్థానిక సంఘ కాపరులు ఆనంద్, మరియు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ , మరియు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తోపాటు అనేక మంది క్రైస్తవ సమాజ సంఘ పెద్దలు పాస్టర్ పాస్టర్ పార్థిదేహాన్ని సందర్శించి పూల గుచ్చు లు నుంచి ప్రార్థన చేశారు.


ప్రవీణ్ తల్లి మరియమ్మ, తమ్ముడు కిరణ్, భార్య జెసిక , కుమార్తెలు, మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతం నుండి వచ్చిన ప్రవీణ్ బావమరిది లు పార్ధదేహాన్ని చూసి దుఃఖ సాగరంలో కన్నీరు కారుస్తూ ప్రవీణ్ కోసం చాలా గొప్ప విషయాలు వినిపించారు.


తదుపరి తిరుమలగిరి గ్యారిసన్ క్రైస్తవ సమాధి స్థలమందు సుమారు 50 వేల మంది అభిమానుల మధ్య భారీ వాహనంలో ఊరేగింపు గా వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు సమాధి కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రార్థనలతో ముగించారు.


శత్రువులు చంకలు కొడుతున్నారు, అభిమానులు రొమ్ములు కొట్టుకుంటున్నారు.పరలోకం చప్పట్లు కొడుతుంది. ఇది మరణం కాదు విజయం, ఆయన భౌతికంగా దూరమవున ఆత్మీయంగా ఆయన ఆశయాలు మన మధ్యలో ఉన్నాయి అంటూ… ఒక్క ప్రవీణ్ మరణిస్తే లక్షల కోట్ల మంది ప్రవీణులను మన దేవుడు పుట్టిస్తాడని అక్కడకు కూడి వచ్చినవారు సందర్భాన్ని బట్టి మాట్లాడారు.



ప్రవీణ్ పగడాల అంతిమ యాత్ర ను లైవ్ లో లక్షలాదిమంది వీక్షించారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కామెంట్స్ రూపంలో ఎవరికివారు అభిమానాన్ని చాటుకున్నారు.


గురువారం సాయంత్రానికి ప్రవీణ్ పగడాల భౌతిక గాయాన్ని కి అంత్యక్రియలు ముగిచాయి. ఇక ఆయన అభిమానులు పీ ఎం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన మరణం హత్య..? లేక ప్రమాదమా..? చూడాలి మరి !
వార్త సేకరణ: నేరేడుమిల్లి వినయ్ కుమార్ (జర్నలిస్ట్) 9573811217