
జీతాలు కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఇంజనీర్లకు సంఘీభావం తెలిపిన జిల్లా ఏపీటీఫ్
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఏపీటీఎఫ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఎన్ మునీశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీటీఎఫ్ టీచర్ ఫెడరేషన్ నూతన క్యాలెండరును డిఇఓ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉందుర్తి వీర వెంకటరావు,రాష్ట్ర కౌన్సిలర్ జి.వి.వి.సత్యనారాయణ,పినిపే కృష్ణమూర్తి, మోర్త రాజశేఖర్,గుత్తాల వేంకటేశ్వరరావు,
ఎన్.నరసింహ మూర్తి,పీతల రాంబాబు, సఖిలే తిరుపతిరావు, వీధి రాజశేఖర్, మడికి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మునీశ్వరరావు మాట్లాడుతూ… జనవరి 19న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు మరియు యూనియన్ నాయకులు తప్పక హాజరుకావాలని కోరారు.