

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 07:
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు, ఐపీఎస్ నిర్వహించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పిజిఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని, “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, భాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని, ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై 24 మంది ఫిర్యాదీదారులు వారి సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.