V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 13

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక ప్రాంతీయ అమలాపురం ఆసుపత్రి నందు ఉన్న జిల్లా సత్వర వైద్య సేవలు కేంద్రంలో ప్రత్యేక ఆరోగ్య అవసరాలు ఉన్న పిల్లలను గ్రామాల నుండి చికిత్స కొరకు కేంద్రానికి తరలించుటకు అద్దెకు తీసుకున్న వాహనాన్ని జిల్లా వైద్య శాఖాధికారి డా. యం దుర్గారావు ప్రారంభించగా, అదనపు డి.యం.హెచ్ ఓ, సిహెచ్ వి భారత లక్ష్మి ఆర్.బి. యస్.కే ప్రోగ్రాము ఆఫీసర్ డా. జాన్లేవి,యూ.పి.హెచ్.సి.

సిబ్బంది పాల్గున్నారు, జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ దుర్గారావు దొర మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాలలో జరుగుచున్న యన్.సి.డి. సి.డి సర్వే లో గుర్తించిన చిన్నారు లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న జిల్లా సత్వర వైద్య సేవలు కేంద్రానికి తరలించి ప్రత్యేక సేవలు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో వాహనాన్ని అందుబాటు లో కేవలం జరిగిందన్నారు.

కావున సిబ్బంది అందరు గ్రామాలలో ప్రజానీకానికి ఈ యొక్క విషయాన్ని తెలియజేసి తెలియచేసి వైద్య సేవల అవసరమైన వారు ఈ యొక్క తరలింపు సేవలను సద్వినియోగం చేసుకునేందుకు అవగా హన పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వైద్యులు సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.