సృజనాత్మకతను వెలికి తీసినప్పుడేవిద్యార్థులకుఉజ్వల భవిష్యత్తు సాధ్యం: ఎమ్మెల్యే గిడ్డి

పి.గన్నవరంలో సైన్స్ ప్రదర్శన కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం జనవరి 04:

విద్యార్థినీ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసిన ప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనా రాయణ తెలిపారు శనివారం స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు భట్టి విధానానికి స్వస్తి పలికి విశ్లేషణాత్మకంగా విద్యా బోధన అభ్యసించినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలకు నూతన ఆవి ష్కరణల ద్వారా నాంది పలికి మన మేధస్సుకు పదును పెట్టినప్పుడే కొత్త కొత్త ఆవిష్క రణలు సాధ్యమ వుతాయ న్నారు. శాస్త్రవేత్తలు అంద రూ సాధారణ విద్యార్థులు లేనని వారికి ఎదురైన అనుభవాలతో కొత్త కొత్త ఆవిష్కరణలను చేయడం ద్వారా ప్రపంచానికి కొత్త వెలుగులు సృష్టించారన్నా రు. శాసన మండలి సభ్యులు ఇళ్ళ వెంకటే శ్వరరావు కుడిపూడి సూర్యనారాయ ణరావులు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని మానవ మనుగడకు విజ్ఞాన శాస్త్రమే మూలమన్నారు. విద్యార్థినీ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి విద్యా వైజ్ఞానిక ప్రదర్శ నలు దోహదం చేస్తా యన్నారు. సమాజానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా తక్కువ ఖర్చుతో వినూత్న ఆలోచనలు రేకెత్తించేలా ప్రద ర్శనలు ఉండాలన్నారు ప్రతి విద్యార్థిలో మనోవిజ్ఞానాన్ని నైపుణ్యాలను వెలికితీయ డానికి ఇటువంటి ప్రదర్శ నలను నిర్వహించాలన్నారు ప్రధానంగా సౌర విద్యుత్తు పునరుత్పాదక కిందన వనరులు వంటి ప్రాధాన్యత అంశాల పరంగా విద్యార్థు లలో అంతర్లీయమై ఉన్న మేధా సంపత్తికి పదును పెట్టేందుకు ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రదర్శనలు ఉపకరిస్తా ల్యన్నారు. విద్యా ర్థులలోని సృజనాత్మక ఆలో చనలు ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఉండాలన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభా పాటవా లను కనబరిచి రాణించేలా ఉపాధ్యాయులు పూర్తి బా ధ్యత వహించాలన్నారు. విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యా యులు చెప్పే పాఠాలకే పరిమితం కాకుండా వారి ఆలోచనలకు పదులు పెడితే వినూత్న ఆలో చన లతో సరికొత్త ఆవిష్క రణలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందన్నారు. 8 9 10 తరగతిలోకి చెందిన విద్యార్థిని విద్యా ర్థులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు రూపొందించి జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. డి ఆర్ ఓ కె మాధవి మాట్లాడుతూ విద్యా ర్థుల చెంతకే ఆధునిక పరి జ్ఞానం మరియు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు వివరించే లక్ష్యంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కు ప్రభుత్వం చుట్టిందన్నారు విద్యార్థులు సృజనాత్మకతను పెం పొందించు కొని నూతన ఆవిష్కర ణలకు నాంది పలకాల న్నారు ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే పోటీ పరీక్షల్లో పాల్గొనడాన్ని అలవాటు చేసుకోవా లన్నారు. విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మెదడుకు పదను పెట్టాలన్నారు. ప్రతికూల ఆలోచనలకు పక్కనపెట్టి సానుకూల దృక్ఫథాన్ని అలవర్చు కోవాలని అప్పుడే అన్నింటా రాణించగలుగు తార న్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో భిన్నంగా ఆలోచించడమే కాకుం డా, కృషి, పట్టుదలతో చదువుకున్నప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగు తారన్నారు. డీఈవో సలీం భాష మాట్లా డుతూ జిల్లా ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రద ర్శనలుగా నిలవాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలకు పదను పెట్టే విధంగా ఉపా ధ్యాయులు అవసరమైన మార్గదర్శ కత్వం చేయా లన్నారు. ప్రతి విద్యార్థిలో అంత ర్గతంగా ఉన్న సృజనా త్మకతను గుర్తించి, వారిని ఆయా రంగాల్లో వారిని నిష్ణాతులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తల్లిదండ్రులు వారి అభిప్రాయా లను తమ చిన్నారులపై రుద్దకుండా, వారిలో ఉన్న జిజ్ఞాసకు పదను పెట్టే విధంగా తీర్చిదిద్దాలన్నారు 22 మండలాల నుంచి జిల్లా సైన్స్‌ ఫేర్‌కు 110 ప్రాజెక్టులు ప్రదర్శ నకు వచ్చాయన్నారు. వీటి నుంచి విద్యార్థి వ్యక్తిగత విభాగం, గ్రూపు విభాగం, ఉపాధ్యాయ విభాగం నుంచి రెండేసి వంతున మొత్తం ఆరు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందుగా జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లోగో ఆవిష్కరించిన అనం తరం జాతీయ పతాకం, జిల్లా సైన్స్‌ కాంగ్రెస్‌ పతాకం, పాఠశాల పతాకాలను ఆవిష్కరిం చారు.జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలలో సైన్స్‌ చిత్రమాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల రంగులు, ముగ్గులతో చిత్రాలను రూపొందించిన చిత్రాలు ఆహూతులను, విద్యా ర్థులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సేవ్‌ వాటర్, పర్యవరణ పరిరక్షణ, సేవ్‌ గర్ల్స్, మూత్రపిండాలు గుండె రక్త ప్రసరణ టెలిస్కోప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శ నలో జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి వార్ల ఫోటోలు, సాంస్కృ తిక కార్యక్రమా లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్ర మంలో ఆర్డీవో పి శ్రీకర్, జిల్లా సైన్స్ అధికారి జి వి ఎస్ సుబ్రహ్మణ్యం, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నా మన రాంబాబు ఎస్ ఎస్ ఏ సెక్టో రియల్ అధి కారులు డివిఎస్ సుబ్రహ్మ ణ్యం డి రమేష్ బాబు, ఎం ఏ కే భీమారావు ఎంబిబి సత్యనారాయ ణ, పి రాం బాబు పాఠశాల ప్రధానో పాధ్యా యులు డివిఎస్ ప్రసాద్ ఎం పీ డీ వో, కె వి ప్రసాద్ తాసిల్దార్ పి శ్రీ పల్లవి, డీఎస్ఓ ఏ ఉదయ భాస్కర్, ఎంఈఓలు కోన హెలీన చింతా వీరభ ద్రనందం స్కూల్ కమిటీ చైర్మన్ నల్ల దుర్గారావు ఎంపీటీసీ పులపర్తి వెంక టలక్ష్మి స్థానిక ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

శానపల్లిలంకలో ఉచిత కంటి వైద్య శిబిరాన్నికి విశేష స్పందన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి అక్టోబర్ 11: శానపల్లిలంక ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కి విశేష స్పందన లభించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పై ఎస్సీ కమిషన్ చైర్మన్ సీరియస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఎస్సి కమిషన్ కార్యాలయం కొవ్వూరు , జూన్ 12: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసును ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ […]

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ఎస్) దరఖాస్తులకు 266 అర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 21: ప్రతి అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం ఉండాలని […]

ఉపాధి హామీ కూలీలకు పెరిగిన కూలీ రేట్లు 300/-రూ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఎన్డీఏ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయటంతో పాటు.. కూలీల కనీస వేతనాన్ని రూ.263 నుంచి […]