
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 21:

ప్రతి అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారిని బిఎల్ఎన్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్ర మంలో డిఆర్ఓ, ఆర్డీవో కే మాధవి, డిఆర్డిఏ డ్వామా పీడీలు, సాయినాథ్ జై చంద్ర గాంధీ, ఎస్ మధుసూదన్, ఎస్ డి సి కృష్ణమూర్తి లు ఫిర్యాదు దారుల నుండి సుమా రుగా 266 అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ పరిష్కార విధానం స్థితిగతులపై సంతృప్తి స్థాయిలను ముఖ్యమంత్రి కార్యా లయం నుండి ఐవిఆ ర్ఎస్ సర్వే ద్వారా స్వీకరించడం జరుగు తోoదన్నారు. ధరఖాస్తు దారుడితో మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తూ స మస్యలను సావధానంగా విని అర్థం చేసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు అధికా రులు అర్జీదారుల స మస్యలపై సానుకూ లంగా స్పందించాలన్నా రు ప్రజా సమస్యల పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న దన్నారు.

పేద ప్రజలు పిజిఆర్ఎస్లో తమ సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు సమర్పిస్తారని వాటిలో అర్హత కలిగిన ధరఖాస్తు లకు అర్జీదారునికి సంతృప్తికరమైన రీతిలో నాణ్యమైన పరిష్కారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కార్యా లయం, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరాల వారి వద్ద నుండి అందిన ప్రజా సమస్యల ఫిర్యాదు ల పరిష్కారంలో అధికా రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకు ని ప్రతీ దరఖాస్తును క్షు ణ్ణంగా పరిశీలించాలన్నారు.

దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కా రానికి చర్యలు తీసుకోవా లని, అర్హత లేని దరఖా స్తులను తిప్పి పంపుతూ అందుకు గల కారణాల ను స్పష్టంగా ధరఖాస్తుదా రునికి, సదరు ప్రజాప్రతి నిధికి తెలియజేయాల న్నారు. రెవిన్యూ చట్టా లపై తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి ప్రజా సంతృ ప్తే కొలమానంగా పనిచే యాలని ఆదేశించారు.

ఆర్డీవో కే మాధవి ప్రసంగి స్తూ ప్రతి మండల డివిజన్ జిల్లా కేంద్రాలలో అందిన అర్జీలను వెంటనే పీజిఆర్ఎస్ వెబ్సైట్లో ఆన్లై న్ చేస్తూపరిష్కరించాలని సూచించారు ఈ వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని పీజీఆర్ఎస్లో నమోదవు తున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉంద న్నారు. అర్జీలు ఏ స్థా యిలోనూ పెండిoగ్ ఉండరాదన్నారు. అర్జీదారుల సమస్యను అధికారులు ఓపిగ్గా విని పరిష్కార మార్గాన్ని తెలపాల్సిన బాధ్యత ఉందన్నారు. సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు. అర్హతను పరిశించాలని, అనర్హత ఉంటే తగిన కారణాలను అర్జీదారునికి వివరించాలన్నారు.

పరి ష్కారమైన అర్జీదారులతో ఐవీఆర్ఎస్ ద్వారా ఉన్న తాధికారులు వారి సంతృ ప్తి స్థాయిని తెలుసుకోవ డం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తుల ను అవసరమైతే సంబం ధిత అధికారులు క్షేత్ర స్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీ దారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువు లోపు తప్పని సరి పరి ష్కారం ఉండాలన్నా రు.

గడువులోగా పరిష్కరిం చాల్సిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని, గడువు తీరిన అర్జీలు ఏ శాఖ లోనూ పెండిoగ్ ఉండరాదన్నారు ఆన్లైన్ డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన అవగాహనను పెంపొందించుకోవాలని ఎవరి ప్రలోభాలకు లోను కాకుండా వ్యవహరించాలని యూబీఐ ప్రతినిధి కిరణ్ వెల్లడించారు కేవై సీలు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లి ఖాతా దారులు చేయించు కోవాలని సూచించారు డిజిటల్ అరెస్ట్ అనేది లేదని సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు తెలపాలన్నారు సోషల్ మీడియా పేరిట ఫ్రెండ్ అని చెప్పి మోసాలు జరుగుతున్నాయని అటువంటి వాటిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

ఏటీఎం కార్డు వెనుక పిన్ నెంబర్ రాయకూడదని సూచిం చారు. బ్యాంకు లావా దేవీల పాస్వర్డ్ పిన్ నెంబర్లు ఎట్టి పరిస్థితుల్లో నూ ఎవరికి తెలియజేయ రాదన్నారు జిల్లా దివ్యాం గులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచా లకులు వి వి.వి లక్ష్మణరావు ఆధ్వర్యం లో డిఆర్ఓ రాజకుమారి ద్వారా ఆరుగురు చెవిటి మూగ దివ్యాంగులకు రూ 15వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.