శానపల్లిలంకలో ఉచిత కంటి వైద్య శిబిరాన్నికి విశేష స్పందన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి అక్టోబర్ 11:

శానపల్లిలంక ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కి విశేష స్పందన లభించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక గురువు కాలువ వంతెన వద్ద,రక్షణ సువార్త ప్రార్ధన మందిరం ఆవరణం పాస్టర్ స్టీఫెన్ ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి మరియు సిలోయం ప్రాథమిక కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో సుమారు 120 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 12 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేసి, ఈనెల 15 వ తేదీ న కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి నందు శస్త్రచికిత్సకు అన్ని రకాల సదుపాయాలు రోగులకు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ప్రభాకర్ , మోసే లు తెలిపారు. రోగులందరికీ రవాణా, మందులు, భోజన వసతి కనిపిస్తామని, శస్త్రచికిత్స అనంతరం ఫాలో అప్ ట్రీట్మెంట్ (చికిత్స తర్వాత సమస్యలు ఏవైనా ఉన్నాయా లేదా వ్యాధి తిరిగి వచ్చిందా అని పర్యవేక్షించడం) కూడా నిర్వహిస్తామని V9 ప్రజా ఆయుధం మీడియాకు తెలిపారు. గ్రామాలలో పేదలకు మేలు కలిగే ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినందుకు, పాస్టర్ జె స్టీఫెన్ ను, మరియు కంటి డాక్టర్స్ బృందాలను ప్రజా ఆయుధం మీడియా తో పాటు గ్రామ పెద్దలు, రక్షణ సువార్త ప్రార్ధన మందిరం సంఘము మరియు విద్యావంతులు వారిని అభినందించారు.

Related Articles

లెజెండరీ డాక్టర్ కారెం రవితేజా జన్మదిన శుభాకాంక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం జూన్ 22: వైద్య సేవలో అద్భుతమైన ఆరోగ్యం అందించి కరోనా సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ […]

పరిశ్రమల అభివృద్ధికి ఎగుమతుల పెంపుదల కోసం ఆవశ్యకమైన అనుమతులు : కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ O8: జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశ్రమల అభివృద్ధికి ఎగుమతుల పెంపుదల కోసం ఆవశ్యకమైన అనుమతులు, రాయితీల ద్వారా ఔత్సాహిక పారిశ్రామి […]

స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలొద్దు/ఏపీఈపీడీసీఎల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ కోనసీమ, జూలై 23 : విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటి […]

ప్రణయ్ హత్య కేసు సంచలన తీర్పు నిందితులకు ఉరిశిక్ష

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు తెలంగాణ మార్చ్ 10: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ […]