నిపుణులతో మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించారు: ఎమ్మెల్యే ఆనందరావు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతోమంది నిపుణులతో మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించారు: ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 4:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శనివారం నుండి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జిల్లా వ్యాప్తంగా 13 జూనియర్ కళాశాలలో ప్రారంభం అయిందని స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. శనివారం స్థానిక వెచ్చవారి అగ్ర హారంలోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యా హ్న భోజన పథకాన్ని శాసనసభ్యులు డిఆర్ఓ కె మాధవిలు ప్రారంభించి సహపంక్తి భోజనం ఆరగించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లా డుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతోమంది నిపుణు లతో మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించి హాజరు శాతాన్ని పెంచ డంతో పాటుగా నాణ్య మైన పోషకాహారాన్ని అందించే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలో ఉన్న పాఠ శాలల్లో భోజనాలను తయారు చేసి తాజాగా వాహనాలలో భోజనా లను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు తరలిస్తారని తెలిపారు. ఈ యొక్క పథకానికి నిత్యాన్న దాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా నామ కరణం చేశారన్నారు. పోషక విలువలు కలిగిన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకై ఈ యొ క్క పథకాన్ని రూపొందిం చారన్నారు ఒకవైపు విద్యార్థులు అర్ధాకలితో విద్యను అభ్యసించడం, మరోవైపు చాలా మంది విద్యార్థులు రోజూ ఉద యం 8 గంటలకు బయ ల్దేరి చాలా దూరం ప్రయా ణించి కాలేజీకి చేరుకోవ డం కొన్నిసార్లు ఇంట్లో వీలు కుదరకపోవడం, ఉదయాన్నే వండి తెచ్చుకున్న క్యారేజీ మధ్యాహ్నానికి పాడవ డంతో విద్యార్థులు అవ స్థలు పడుతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకం అమలు మూ లంగా విద్యార్థిని విద్యా ర్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారన్నారు డి ఆర్ ఓ కే మాధవి మాట్లాడుతూ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2,414 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అ భ్యసించుచున్నారన్నారు ఇందులో 1,382 మంది మొదటి సంవత్సరం, 1,132 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారన్నారు. జూనియ ర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకూ నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించను న్నారు ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసే దిశగా నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, ఉత్తీర్ణతా ఫలితాలు ఫలితాల మెరుగుదలకు ప్రణాళి కలు రచించారనీ. ఇందు లో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజ న పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రారంభించారన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండిహారిక, మెట్ల రమణబాబు ప్రజాప్రతినిధులు జూనియర్ కళాశాల లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నియామకం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 26: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లామండపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను […]

కోళ్లకే తప్ప మనిషికి బర్డ్ ఫ్లూ సోక లేదు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఏలూరు ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం పూర్తిగా అబద్దమని జిల్లా అధికారులు గురువారం […]

కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను బలపర్చాలి వి వి వి చౌదరి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -మండపేట ఫిబ్రవరి 23:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులనయోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ వివివి […]

ఉద్యానవనం ముగ్గుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 11:అమలాపురం సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో ఉన్న ఉద్యానవనం నందు శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం […]