మత్స్యకార కుటుంబానికి 20 వేలు భరోసా విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ముమ్మిడివరం జనవరి 03:

రానున్న ఏప్రిల్ ఒకటో తేదీన ఇటీవల క్యాబినెట్లో పెంచి ప్రకటించిన రూ 20 వేల మత్స్యకార భరోసా నిధులు అందించి చేపల వేట నిషేధిత సమయాన్ని ఏప్రిల్ 15 నుండి ప్రకటించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖలు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కె అచ్ఛేన్ననా యుడు తెలిపారు. శుక్రవారం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండల పరిధి కోరంగి గ్రామంలో ఓ ఎన్ జి సి గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు పనులు మూలంగా చేపల వేట జీవనోపాధి కోల్పోయిన మ త్స్యకారులకు ఓఎన్జిసి ప్రకటించిన నష్టపరిహారాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అగ్నికుల క్షత్రియుల గంగపుత్రుల అభ్యున్నతికై పలు సంక్షేమ కార్యక్రమాలను గతంలో మాదిరిగా రాయితీ లతో వలలు నావలు ఐస్ బాక్సులు చేపల ఇన్సులేటెడ్ వాహనాలు సరఫరా చేసేందు కు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. మత్స్య కార భరోసా గతంలో 10,000 రూపాయలు ఉండేదని ఇప్పు డు ప్రభుత్వం 20 వేలకు పెంచి చేపల వేట నిషేధిత సమయానికి ముందే అందిం చి చేపల వేట నిషేధిత సమయాన్ని ప్రకటించ నున్నదని తెలిపారు. రైతు భరోసా గతంలో కన్నా పెంచి రాష్ట్ర ప్రభుత్వం 10 వేలను కేంద్రం మరో 10 వేలను వెరసి 20 వేల ను ఇచ్చేందుకు ఆ మోదం తెలిపిందన్నారు.

అదేవిధంగా తల్లికి వందనం ఇంటిలో ఎంత మంది చిన్నా రులు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం లోనే అందించడం జరుగు తుందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేనందున ఈ ఏడాది తల్లికి వందనం అమలు చేయడానికి వీలు పడలేదని వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభ సమయంలోనే నిధులు తల్లులు ఖాతాకు జమ చేయడం జరుగు తుంద న్నారు. గత ఆరు నెలలుగా ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచి గాడిలో పెట్టడం జరుగుతుందన్నారు. ఏటా 15% వృద్ధి రేటుతో స్వర్ణాంధ్ర @2047 సాధించేందుకు విజన్ డాక్యుమెంట్ను ప్రారంభించుకోవడం జరిగిందని తద్వారా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రా నికి ఇటీవల కాలంలో అన్ని విధాలుగా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపన దిశగా పెట్టుబడులు నమ్మకంతో వస్తున్నాయని తద్వారా ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు రాబోయే ఐదేళ్లలో కల్పించడం జరుగు తుందన్నారు. జి ఎస్ పి ఎస్ ఓఎ న్జిసి సంస్థలు సముద్ర తీరంలో పైప్లైన్లు వేయడం మూలంగా చేపల వేట కోల్పోయిన మత్స్య కారులకు 2006 నుండి చేపల వేట నిషే ధిత కాలానికి సంబంధించి నష్టపరిహారాలను చెల్లించడం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో పరిపాలన వ్యవ స్థను గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేయడానికి కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో పాటు పడుతుం దన్నారు. ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి ఆర్థిక సంప దను పెంచే ప్రయత్నం చేస్తు న్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధముగా సామాజిక భద్రతా పింఛన్లు 4000 వరకు పెంచి 64 లక్షల మందికి ఇవ్వడం జరు గు తుందన్నారు. అర్హులకే పింఛన్లు దక్కాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హు లకు పింఛన్లు దక్కకుండా తనిఖీకి ప్రభుత్వం చర్యలు తీసు కుందని మూడు నెలల కాలవ్యవధిలో సరిదిద్దడం జరుగుతుందన్నారు. ఐదు రూపాయ లకే భోజనాన్ని అన్న క్యాంటీన్ ద్వారా అందిం చే వ్యవస్థను పునరుద్ధరించ డం జరిగిందన్నారు. 2014- 2019 మధ్యకాలం మత్స్య కారులకు స్వర్ణయుగమ న్నారు. రాష్ట్రానికి 950 కిలోమీటర్లు పొడవునా సముద్ర తీరం ఉందని, మత్స్యకారుల అభ్యున్నతికి వలలు పడవలు మత్స్య సంపద యోజన ద్వారా రాయితీలపై అందించడం తోపాటు తీరం పొడవునా జెట్టీలు ,హర్బర్లు, లాండింగ్ సెంటర్లు నిర్మాణానికి ఇన్చార్జి మంత్రివర్యులుగా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. మత్స్యకారుల ప్రమాద భీమా యోజన 5 లక్షలు వరకు ఇవ్వడం జరు గుతుంద న్నారు. ముమ్మిడివరం పి గన్నవరం కొత్తపేట మండపేట రామచం ద్రపురం నియోజకవ ర్గాలలో ఆరో విడతలో 69 గ్రామాలకు చెందిన 23 వేల 450 మంది మత్స్యకారులకు నెలకు 11,500 చొప్పున 5 నెలల 15 రోజులకు గాను 148 కోట్ల 37 లక్షల, 18,500 రూపా యలను ఓఎన్జిసి అందించిన నష్టపరిహా రాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు వర్చువల్ విధానంలో జమ చేశారు.

గనులు భూగర్భ, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మత్స్య కారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అనేక అభి వృద్ధి సంక్షేమ కార్యక్రమా లు రాయితీలతో అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగప రుచుకుని మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు నింపుకో వాలని పిలుపునిచ్చారు. నిత్యం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మత్స్యకారుల సంక్షేమానికై ఎంతో గానో తపిస్తున్నారని తెలిపారు పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు దాట్ల సుబ్బరాజు ల కృషి మూలంగా 2006 నుండి మత్స్య కారులకు గ్యాస్ పైప్ లైన్లు ఏర్పాటు మూ లంగా నష్టపోయిన చేపల వేట కాలానికి ఆయా కంపెనీల నుండినష్టపరిహారాలు అందించడం జరుగుతుందన్నారు. మత్స్యకార భరోసాను రెట్టింపు పెంచి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వా నిదేనని గర్వంగా తెలిపారు అదేవిధంగా గతంలో మాదిరిగా మత్స్యకారుల సంక్షేమానికి రాయితీలతో పథకాలను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడు తోందన్నారు. 50 సంవ త్సరాల నిండిన మత్స్య కారులకు సామాజిక భద్రత పింఛన్ పొందే హక్కు కల్పించిన ఘనత తమ ప్రభుత్వాన్ని దేనన్నారు. పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ గాడి మొగలో చమురు సహజ వాయువులు వెలికితీత పైప్ లైన్లు ఏర్పాటు ప్రారంభించి నప్పుడు నుండి చేపల వేట నష్టపోయిన మత్స్యకారులకు నష్ట పరిహారాలు ఆయా కంపెనీల ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం 103 రోజులు పోరాటాల చేయడం మూలంగా అగ్రిమెంట్ కుదిరి ఇప్పటివరకు నష్టపరిహారాలు పొందడం జరుగుతుంద న్నారు ఓఎన్జిసి రెండో పైప్ లైన్ వేసేందుకు సన్నద్ధం అవుతుందని అప్పుడు కూడా ఈ యొక్క చేపల వేట నిషేధిత సమయం లో పరిహారాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. 2006లో నెలకు పరిహారం 9,750 ఉండగా 2022లో దీన్ని నెలకు 11,500 కు పెంచారన్నా రు. పైపులైన్లు ఏర్పాటు మూలంగా సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీరని నష్టం వాటితోందని తద్వారా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో సముద్రంపై చేపల వేట సాగించే వారందరికీ పరిహారాలు అందే దిశగా అందరూ ఐకమత్యంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంద న్నారు. 14 మత్స్యకార కులాలకు నష్టపరి హారాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకార కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అండగా నిలవాలన్నారు.

పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ మత్స్య కారుల సర్వముఖా భివృద్ధి ప్రభు త్వం పాటుపడుతూ ఉందని సుమారు 950 కిలోమీటర్లు పొడవున సముద్ర తీరం పై మత్స్యకారులు ఆధా రపడి జీవనం కొనసాగిస్తున్నారని వీరిఅభివృద్ధిలో సముద్రతీరం కీలక భూమిక పోషించను న్నదన్నారు. తద్వారా బీసీ వర్గాల సంక్షేమానికి రాయి తీలతో ప్రభుత్వం అన్ని విధాల పాటుపడు తుందన్నారు. మత్స్య కారులు ఉన్నతంగా జీవించేందుకు ప్రభుత్వ రాయితీలను అంది పుచ్చుకోవడంతోపాటు స్వయంకృషితో ముందుకు సాగాలన్నారు. కాకినాడ ఎమ్మెల్యే వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మత్స్య కారుల ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ కార్యక్ర మాలను అమలు చేస్తుందన్నారు మత్స్యకారుల పిల్లలకు గురుకులాలు నిర్మించి విద్యాభ్యాసం చేపట్టడం, ఆధునిక సాంకేతికతతో చేపల వేట పనిముట్లను రాయితీపై అందించడం జరుగుతుందని మత్స్య కారులు సంక్షేమ పథ కాలను సద్వినియోగ పరు చుకుని జీవనోపా దులను మెరుగుపరు చుకోవాలని సూచించారు.

గంగపుత్రుల శ్రేయస్సును కోరి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు మాట్లా డుతూ గంగపుత్రుల అభ్యు న్నతికి ప్రభుత్వం కట్టు బడి ఉందని ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం వేట నిషేధిత సమయంలో నష్టపరిహా రాలను క్రమం తప్పకుండా అందిస్తున్నారన్నారు. మత్స్యకార ప్రాంతాలలో త్రాగునీరు మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వపరంగా చర్యలు తోపాటు కంపెనీలు కూడా ఆర్థిక సహకారం అందించాలని కోరారు మత్స్య శాఖ కమిషనర్ డోలా శంకర్ మాట్లాడుతూ చమురు సహజవాయువు సంస్థ లు సి ఎస్ ఆర్ నిధి కింద చమురు వెలికితీత గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రకటించిన 40 శాతం రాయితీకి అదనంగా మరో కొంత శాతం నిధు లు కంపెనీలు సమకూరీస్తే లబ్ధిదారులు వాటా ధనం తగ్గిన మత్స్యకారుల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఆ దిశగా చమురు సంస్థలు సహక రించాలని కోరారు మత్స్య కారుల కు డీజిల్ సబ్సిడీ, మత్స్యమిత్ర గ్రూపులకు రీవాల్మింగ్ ఫండ్, మత్స్య సహకార సంఘాల ఆధీనంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువులలో సీడ్ నర్సరీలు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు ఆక్వారంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు చంద్రన్న రైతు క్షేత్రాల ద్వారా మంచి ప్రగతిని సాధించడం జరుగు తుందన్నారు ముమ్మిడివరం మండలం ఏడు గ్రామాలలో 8,68 కాట్రేనికోన మండలం లోని 11 గ్రామా లలో 9,251 ఐ పోలవరం మండలం 13 గ్రామాలలో 3,709 తాళ్ళరేవు మం డలం 15 గ్రామాలలో 7,050, అయినవిల్లి మండ లం ఆరు గ్రామాలలో 533, కొత్తపేట మండలం మూడు గ్రామాలలో 190 కపిలేశ్వర పురం మండలం ఆరు గ్రామాలలో 505 మంది, కె గంగవరం మండలం 8 గ్రామాలలో 1,352 మంది వె రసి 23, 458 మంది మత్స్య కారులు నష్టపరిహార లబ్ధిని పొందారన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్, స్థానిక ఎంపీ జి హరీష్ మాధుర్, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబురాజు,వనమాడికొండబాబు,అయితా బత్తుల ఆనందరావు,గిడ్డి సత్యనారాయణ,వేగుళ్ళ జోగేశ్వర రావు చిన్న రాజప్ప, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు మాజీ ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం చిక్కాల రామచంద్రరావు ఆర్డీవోలు మల్లిబాబు, మాధవి, శ్రీకర్ స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

పోరాటాలను త్యాగాలను నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 15: స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను త్యాగాలను నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. […]

కేంద్ర ప్రాయోజిత పథకాలు: అధికారులు కీలక భూమిక పోషించాలి: పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాధుర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం ఏప్రిల్ 23: కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు లక్షిత వర్గాలకు అందించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు […]

మహోన్నత సేవా పతకం అందుకున్న ఎఎస్పీ మురళీకృష్ణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజమహేంద్రవరం ఆగస్టు 16: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మహోన్నత సేవా పతకాన్ని తూర్పుగోదావరి జిల్లా అదరపు ఎస్పి(పరిపాలన) ఎస్‌ […]

పొలిటికల్ చీప్ ఎనలిస్టు కుమార్ చౌదరి ను మర్యాదపూర్వకంగా కలిసిన వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మంగళగిరి జూన్ 30: పొలిటికల్ చీప్ “ఎనలిస్టు” మరియు సాఫ్ట్వేర్ కుమార్ చౌదరిను V9 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ […]