కామ్రేడ్ కుడుపూడి రాఘవమ్మ ఇకలేరు కుడిపూడు రాఘవమ్మకి ఘన నివాళి:సిపిఎం జిల్లా కమిటీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 07:కూలిపోరాటాల ధ్రువతార కామ్రేడ్ కుడిపూడి రాఘవమ్మ మంగళవారం మధ్యాహ్నం మరణించారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాదపడుతూ నేను తుదిశ్వాస విడిచారు.


కుడిపూడి రాఘవమ్మ మరణానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందని జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ కుడిపూడి రాఘవమ్మ మరణం సిపిఎం జిల్లా ఉద్యమానికి తీరని లోటన అన్నారు.వ్యవసాయ కూలీ పోరాటాలు మద్యపాన వ్యతిరేక పోరాటాలలో క్రియా శీలంగా పనిచేశారని . ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలుగా చాలా కాలం సేవలందించారని తెలిపారు
ఐద్వా జిల్లా అధ్యక్షురాలుగా పనిచేశారు. వ్యవసాయ కార్మిక సంఘానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురారాలిగా పని చేశారు.ప్రస్తుతం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షురాలుగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు గాను కొనసాగుతున్నారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయినవిల్లి మండలం తొత్తరమూడీ గ్రామస్తురాలు. ఆమె భర్త, డబుల్ ఎం ఏ మాస్టారు.ఆయన కూడా సిపిఎం లో సభ్యుడిగా సేవలందించారని ఆయన ప్రోత్సాహంతో ఆమె సిపిఎం కార్యక్రమాల్లోకి ప్రవేశించి చూరుగ్గా పనిచేసారని తెలిపారు .1990 వ దశాబ్దం వ్యవసాయ కూలీ ఉద్యమాల్లో ఒక స్వర్ణయుగం. కోనసీమలో తూర్పుగోదావరి జిల్లాలో ఉవ్వేత్తున జరిగిన కూలీ పోరాటాలు.భూస్వామ్య వ్యతిక పోరాటంలో ఆమె కీలక పాత్ర వహించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రామచంద్రపురం వెంకటాయపాలెంలో తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేసిన దురఘటన జరిగింది. ఆ పోరాటంలో ప్రత్యక్షంగా ఆమే పాల్గొన్నారు.
1990 తొలి రోజుల్లో సారాకు వ్యతిరేకంగా ఒక పెద్ద మహోద్యమం సాగింది. కోనసీమ కూడా ముఖ్యపాత్ర పోషించారని తెలియజేసారు ఆమే మరణం సిపిఎం పీర్టీకి ప్రజాసంఘాలకు తీరని లోటని తెలిపారు.
కుడిపూడి రాఘవమ్మ మరణానికి వ్యవసాయ కార్మిక సంఘం అఖిల బారత ప్రదాన కార్యదర్శి బి వెంకట్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి బలరాం అండ్రా మాల్యాద్రి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రదాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ జిల్లా కమిటి సభ్యులు డాక్టర్ చల్లా రవి కుమార్ డివి రాఘవులు ఎన్ బలరాం జి దుర్గా ప్రసాద్ కే కృష్ణవేణి టి నాగవరలక్ష్మి డి.లక్ష్మి వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కమిటి కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ ఉపాద్యక్షులు తాడి శ్రీరామూర్తి కౌలురైతుసంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ జ్యోతిబసు జిల్లా అద్యక్ష కార్యదర్శులు పి సురేద్ర ఎంటివి సుబ్బారావు ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కే శంకర్ కో కన్వీనర్ కె ప్రణీత్ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కన్వీనర్ శెట్టిబత్తులు తులసిరావు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి ఎస్తేరురాణి కార్యదర్శి మలాకా సుభాషిని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు బి వెంకటలక్ష్మి కోశాధికారి పి అమూల్య తదితరు సంతాపాన్ని తెలియజేసారు.

Related Articles

సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయ అధికారిగా జి మమ్మీ బాధ్యతలు స్వీకరణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 13: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతిను మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీసీ మమ్మీ. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సమగ్ర […]

జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాలు వద్దే నిత్యావసరాలు పంపిణీ// జాయింట్ కలెక్టర్ టి నిషాoతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 23: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత పారదర్శకంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునః ప్రారంభించి కార్డుదారులకు […]

సూపరిండెంట్ బి మురళీ కృష్ణ అంబాజీపేట తహసిల్దార్ జె.వెంకటేశ్వరి పదవీ విరమణ శుభాకాంక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం, ఫిబ్రవరి 28,2025 కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరిండెంట్ బి మురళీ కృష్ణ , అంబాజీపేట తహసిల్దార్ జె.వెంకటేశ్వరి పదవీ విరమణ కలెక్టరేట్ […]

భూములు మార్కెట్ విలువలు ప్రభుత్వ ఉత్తర్వుల సవరించడానికి చర్యలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 19: కోనసీమ జిల్లాలో జిల్లా రిజిస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భూముల మార్కెట్ విలువలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సవరించడానికి చర్యలు చేపట్టినట్లు […]