డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజ్ఞానం రాష్ట్రస్థాయిలో ప్రభంజనం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 8:

విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజయ పతాకాన్ని ఎగురవేసింది. మొత్తం 35 ప్రాజెక్టులలో నాలుగు ప్రాజెక్టులు కోనసీమ జిల్లాకు చెందినవిగా నిలవడం గర్వకారణంగా నిలిచింది.

గెలుపొందిన ప్రాజెక్టులు:

  • వ్యక్తిగత విభాగం:
  1. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ పాఠశాల, గోడిమ్యాజిక్ అంబ్రెల్లా
  2. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉబలంకరైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం
  • సామూహిక విభాగం:
  • జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, వన్నె చింతలపూడిమల్టీపర్పస్ టూల్ మిషన్
  • ఉపాధ్యాయ విభాగం:
  • జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, తొండవరం ఉపాధ్యాయుడు రూపొందించినవేస్ట్ టు వెల్త్ ప్రాజెక్ట్
    సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు(IAS), SCERT డైరెక్టర్ ఎమ్. వెంకట కృష్ణారెడ్డి, స్టేట్ నోడల్ సైన్సు కోఆర్డినేటర్ శ్రీమతి నాగమణి గారి చేతుల మీదుగా వీరు బహుమతులను అందుకున్నారు.

విశేషాలు:

  • కోనసీమ జిల్లా నుండి రాష్ర్ట స్థాయి పోటీకి నిలిచిన 6 ప్రాజెక్టుల్లో 4 ప్రాజెక్టులు విజయాన్ని సాధించి కోనసీమ జిల్లా ప్రతిభను చూపాయి.
  • 85% స్ట్రైకింగ్ రేట్తో అత్యధిక ప్రాజెక్టులు గెలుచుకున్న ఏకైక జిల్లాగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అవతరించింది.
  • ఇంతకుముందు ఉమ్మడి జిల్లాకు కూడా సాధ్యం కాని విజయాన్ని సాధించడం ప్రత్యేకత.

ఈ ఘనత వెనుక డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గిరజాల వీ ఎస్ సుబ్రహ్మణ్యం అందించిన సమన్వయం ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆయనకు జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

కోనసీమ జిల్లా విజ్ఞాన జట్టు సాధించిన ఈ అత్యుత్తమ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా

విజ్ఞాన ప్రదర్శనలో సాధించిన అసాధారణ విజయానికి సంబంధించి జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, జాయింట్ కలెక్టర్ నిషాంతి జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ కె సలీం భాషా ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

విజయవాడలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా శనివారం ప్రారంభించారు.విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ తదుపరి […]

పౌరులందరూ భాగస్వామ్యం కావాలి: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం 18 జనవరి 2025 పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పౌరులందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. శనివారం […]

కుప్పంలో రెండోరోజు నారా భువనేశ్వరి

నేడు కుప్పంలో రెండోరోజు నారా భువనేశ్వరి పర్యటనప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్న భువనేశ్వరిఅనంతరం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖిటీడీపీ సీనియర్‌ నేతలతో సమావేశంకానున్న భువనేశ్వరి

ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా (X) ఖాతా ద్వారా తెలియజేశారు పవన్ కల్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు […]