
కలెక్టర్ సమక్షంలో ఐదుగురు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: ఆదర్శ రైతు నాయకులు కొరిపల్లి సాంబమూర్తి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 24:

కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్, రైల్వే ట్రాక్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయినవిల్లి మండల పరిధిలోని శానపల్లిలంక గ్రామంలో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పిల్లర్లు ను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు రెవెన్యూ రికార్డులు రైల్వే ట్రాక్ అలైన్మెంట్లు ను మ్యాప్ లో ఆధారంగా పరిశీలించి అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ను ఆదర్శ రైతు నాయకులు కొరిపల్లి సాంబమూర్తి కలిసి రైతులు యెక్క పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.కలెక్టర్ మహేష్ కుమార్ సానుకూలంగా స్పందించి వెంటనే వీటిపై చర్చించి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్, స్థానిక తాసిల్దార్ సిహెచ్ నాగలక్ష్మమ్మ , రెవిన్యూ ఇన్స్పె క్టర్ ఎం ఎస్ రాయుడు, మరియు రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.