అమలాపురం లో ఆనందరావు అన్నా! క్యాంటీ ప్రారంభించిన అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 22:

పేద ధనిక తేడా లేకుండా అందరి ఆకలి తీర్చే అక్ష య పాత్రగా అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధనం మార్కెటింగ్ మత్స్యశాఖల మంత్రి వర్యులు కె అచ్చెన్నాయుడు అన్నా రు. గురువారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 202 వ అన్నా క్యాంటీన్ ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదానాన్ని మహా భాగ్యంగా భావించా లన్నారు కేవలం రూ 5 లకే ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనాలు ఏర్పాటు చేయడం ఆషామాషీ కాదని నాణ్యమైన భోజనం పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టే విధంగా రాష్ట్ర ముఖ్య మంత్రి 15 రోజులకు ఒకసారి ఆర్టిజిఎస్, ఐ వి విఆర్ఎస్ లద్వారా లబ్ధిదారుల అభి ప్రాయాలను సేకరించడం జరుగుతుం దని తద్వారా 98% పనితీరు బాగుందని ప్రజాభిప్రాయం వెల్లడైం దన్నారు ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరి మితమైన అన్న క్యాం టీన్లు ప్రతి నియోజక వర్గంలో ఉండాలని సంకల్పించి మరో 70 అన్నా క్యాంటీన్లకు టెండ ర్లు పిలవడం జరిగిందని తెలిపారు.

ఇకపై 175 నియోజకవర్గాలలో అ న్నా క్యాంటీన్లు నడు స్తాయన్నారు. వీటి నిర్వహణకై కమిటీని ఏర్పాటు చేసి సొసైటీని నియమించామన్నారు స్థానికంగా పురప్రజలు తమ తమ పుట్టినరోజు సంద ర్భంగా అన్న క్యాంటీన్ లో ఆరోజు భోజన ఖర్చును విరాళంగా అందించవచ్చునని సూచించారు. అదేవి ధంగా దాతలు ముం దుకు వచ్చి ఒక నెల ఖర్చును కూడా అందించి దాతృత్వాన్ని చాటుకోవా లన్నారు జిల్లా కేంద్రం అమ లాపురంలో పండుగ వాతా వరణంలో క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింద న్నారు ప్రతిష్టాత్మ కంగా ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్ నిరుపేదల ఆకలి తీర్చడంలో కీలకంగా మారాయన్నారు.

అన్న క్యాంటీన్లు 2014లో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రారం భించిన సబ్సిడీ ఆహార సేవా కార్యక్రమమన్నారు. కిలో రూ 2 లకే సబ్సిడీ బియ్యాన్ని ప్రవేశపెట్టిన “అన్న”గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ ఎన్.టి రామారావు గౌరవార్థం ఈ కార్య క్రమానికి అన్న క్యాంటీన్ గా నామ కరణం చేశారన్నారు.విధ రంగాలలో జీవనోపాధి పొందుతున్న చివరి స్థాయి కార్మికులు అన్న క్యాంటీన్లను ఆశ్ర యించి ఆకలి తీర్చు కుంటు న్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని తెలిపారు.

దిగువ స్థాయి రోజువారి చిరు వ్యాపారస్తుల పాలిట ఈ క్యాంటీన్లు ఒక వరంగా మారి ఆకలిని తీర్చడంలో కీలక భూమిక పోషిస్తు న్నాయన్నారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పొట్టకూటి కోసం పల్లెలనుంచి, పట్టణాలకు వచ్చే రోజు వారీ కూలీలు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడే ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ఉద్యోగులు. ఇతరులకు అన్న క్యాం టీన్లే ఆకలి తీరుస్తు న్నాయన్నారు అల్పాహారమైనా, భోజన మైనా రూ.5 కే అందిస్తుందని రోడ్డు పక్క టీ తాగాలన్నా కనీసం రూ 10 లు వసూలు చేస్తున్నారని అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారమైనా మధ్యా హ్నం, రాత్రికి భోజనమైనా ఆహారం ఇంత తక్కువకు ఎక్కడ లభించ దన్నారు నిరాశ్రయులు, పూటగడవని నిరుపేదలు మాత్రమే కాదు మధ్య తరగతి వారు అన్న క్యాంటీన్లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని గ్రామాల నుంచి వైద్య పరీక్షలు, చికిత్సల నిమిత్తం అసుపత్రులకు వచ్చే వారు వాటినే ఆశ్రయిస్తున్నారన్నారు.

హోటళ్ల కు వెళ్లే ఆర్థిక స్తోమత లేని వారు అన్నా క్యాంటీ న్లో రూ.5, చాలక పోతే మరో రూ 5 ఇచ్చి మరో టోకెన్ తీసుకొని సంతృప్తిగా ఆకలిని తీర్చుకుం టున్నారన్నారు ఒక్కసారైనా అన్న క్యాంటీన్లో తిందాం అనే ఆసక్తితో ఆటో డ్రైవర్లు, కూరగా యలు, పండ్ల వ్యాపా రులు, ఇతర చిరు వ్యాపారులు. తాపీ కార్మి కులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, పెయింటర్లు, నిరుద్యోగులు, వలస కూలీలకు క్యాంటీన్లు ఆసరాగా మారి ఆదరాభి మానాలను చూరగొoటు న్నాయన్నారు వందలాది మంది విద్యార్థులు. గదులు అద్దెకు తీసుకుని ఉంటున్న. వారంతా అన్న క్యాంటీన్లనే ఆశ్రయిస్తున్నారన్నారు.

వీటి పుణ్యమా అని రోజువారీ కూలీలే కాదు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొనే విద్యార్థులకు రూ.15 కే మూడు పూట లాకడుపు నింపుతోoద న్నారు. నిరుపేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంతో పేదల కళ్లల్లో ఆనందం కనిపి స్తోందన్నారు స్వచ్ఛమైన తాగునీరు అందించే సురక్షితమైన త్రాగు నీరు అందించే ఏర్పాట్లు, చేతులు శుభ్రం చేసుకునేం దుకు ప్రత్యేక ఏర్పాట్లు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నా క్యాంటీన్ల నిర్వహణకు చర్యలు తీసు కున్నామన్నారు.ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణం పేదల కడుపునింపి పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిబద్ధతతో కార్యక్రమాన్ని పునరుద్ధ రించినట్లు తెలిపారు.

కేవలం రూ.5 లకే కడుపునిండా భోజనం పెట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం మళ్లీ అన్నా క్యాం టీన్లను పునరుద్ధ రించిందని తెలిపారు.ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారం భించిన అన్నా క్యాంటీన్లలో మెనూ ఖచ్చితంగా అమల య్యేలా చర్యలు తీసుకున్నా మన్నారు మంచి ఆహ్లాదకర, పరిశు భ్రమైన వాతా వరణం లో పేదలు భోజనం చేసేందు కు ప్రభుత్వం అవకాశం కల్పిం చిందన్నారు.ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తి సొంత మవుతుందని, ఇలాంటి ఓ మంచి కార్య క్రమంలో భాగమవుతున్న సిబ్బంది నిబద్ధత, సేవా దృక్పథంతో సేవలు అందించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిషాoతి ప్రభుత్వ విప్, ముమ్మిడి వరం శాసన సభ్యులు దాట్ల సుబ్బ రాజు అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మె ల్యే వేగుళ్ళ జోగేశ్వరరా వు స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనంద రావు, కొత్తపేట శాసనస భ్యులు బండారు సత్యానందరావు అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, ఆర్డిఓ కె మాధవి, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, మెట్ల రమణబాబు మున్సిపల్ కమిషనర్ కె వి వి ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు

Related Articles

సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా 28 మందికి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు

నియామక పత్రాలు అందించిన ఫౌండేషన్ చైర్మన్, ఐటీ సంస్థ ప్రతినిధులు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రామచంద్రపురం, ఫిబ్రవరి 24: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,రామచంద్రపురంలో సత్యం […]

మామిడికుదురు ఎమ్మార్వో ఎదురువాడ కు పదవి విరమణ శుభాకాంక్షలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 30: విధుల నిర్వహణలో మెరు గైన సేవలందించే అధికారు లకు ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

ఎస్సీ ఎస్టిలకు ఉచితంగా అనువైన గృహాలలో రూప్ టాప్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో మొదటి దశలో ఎస్సీ ఎస్టి లకు సంబంధించి ఉచితంగా అనువైన గృహాలలో […]

గురుకుల పాఠశాల విద్యార్థులు వద్దకుజిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం డిసెంబర్ 22:ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం ప్రతిరోజు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా […]