అమలాపురం క్రీడోత్సవ ముగింపు సభ బహుమతులు ప్రదానం వారికే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 23:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 7,8,9 తరగతుల చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కోనసీమ క్రీడోత్సవాలు ఆటలతో ఆరోగ్యం కార్య క్రమం మరపురాని జ్ఞాపకా లుగా నిలిచిపో తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియం నందు కోనసీమ క్రీడోత్సవాలు ఆటలతో ఆరోగ్యం ముగింపు సభ బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు చిన్నతనం నుండి 9వ తరగతి వరకు మాత్రమే శరీరాకృతిని, శారీరక దారుధ్యాన్ని పెంపొందిం చుకునే మెండుగా అవకాశాలు ఉంటాయని ఆ దిశగా ఈ యొక్క ఉత్స వాలకు నాంది పలకడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థికి చిన్నతనంలోనే శరీరం, నరాలు, నాడులు, క్రీడల పట్ల అన్ని విధాల పూర్తి గా సహకరిస్తాయని ఆ విధం గా ప్రతి ఒక్కరు క్రీడల పట్ల మక్కువ చూపాలని తెలి పారు గత 20 సంవత్సరాలు క్రితం ఉన్న క్రీడలు ఆధునిక పోకడలు మూలంగా కను మరుగవుతున్నాయని వాటిని పునరుద్ధరించాలని తపన చొరవతో కార్యక్రమ నిర్వహణకు విద్యాశాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సమన్వ యంతో ప్రతి విద్యార్థి జీవితం లో మరపు రాని క్రీడలను నిర్వహించు కోవడం సంతోషదాయకమన్నారు.

ప్రతి విద్యార్థికి ఒక జ్ఞాపకంగా ఈ యొక్క క్రీడో త్సవాలు జీవితాంతం గుర్తుండి పోతాయన్నారు పదో తరగతి అనంతరం క్రీడలు ఆడటానికి అవకా శాలు తగ్గిపోతాయని కేవలం చదువు పైనే దృష్టి సారించడం ఆరంభమవు తుందన్నారు. ఓటమి గెలుపుకు నాంది పలుకు తుందని ఒక మంచి ఆలోచన ధోరణితో క్రీడ ఉత్సవాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సఫలీకృతo చేయడం అభినందనీయమన్నారు జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల కన్న కలలు నెరవేర్చుకు నేందుకు ఈ క్రీడ ఉత్స వాలు చక్కటి వేదికగా నిలిచాయన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషా oతి మాట్లాడుతూ చిన్ననాటి నుండి క్రీడలు ద్వారా ప్రోత్సహిస్తే మాన సిక ఉల్లాసం మరియు శారీరక దారుధ్యానికి మెరుగైన అవకాశాలు ఉంటా యన్నారు. అదేవి ధంగా తల్లిదండ్రులు ఉపాధ్యా యులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొం దించాలన్నారు. స్థానిక ఆర్డిఓ కే మాధవి మాట్లా డుతూ విద్యతో పాటుగా క్రీడలను ప్రోత్సహించే రీతిలో కోనసీమ క్రీడ ఉత్సవాలు సంస్కృతిని ప్రతి ఏడాది కొనసాగించా లని ఆకాంక్షించారు. రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారు మంచి విజన్ తో తగినటువంటి క్రీడలను నిర్వహించడం అభినంద నీయమన్నారు పిల్లలకు క్రీడా యాక్టివిటీ రుచిని చూపారని దీనిని కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

క్రీడల ద్వారా తన కుమా రుడు సాయి రాజ్ సాత్విక్ ప్రముఖ క్రీడాకారుడుగా రాణించి రాష్ట్రపతి స్థాయి వరకు తనను తీసుకువెళ్లడం ఎంతో గర్వకారణమన్నారు. క్రీడా బహుమతులను కూడా ఇటీవల కాలంలో ప్రభుత్వా లు రూ 10 లక్షల వరకు పెంచాలని అదేవిధంగా క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించాలని సంక ల్పంతో మూడు శాతం రిజర్వేషన్లను కూడా అమల్లోకి తెచ్చాయన్నారు. క్రీడాభివృద్ధి దేశాభివృద్ధికి సూచికన్నారు. డీఈవో షేక్ సలీం భాష మాట్లాడు తూ జిల్లా కలెక్టర్ వారి ప్రత్యేక చొరవతో క్రీడోత్స వాలను విజయవంతం గావించడం జరిగిందన్నారు.

క్రీడల ద్వారా రెండు రోజులుపాటు7,8,9 తరగతులకు చెందిన విద్యా ర్థిని విద్యార్థులు శారీరక మానసిక ఉల్లా సాన్ని పొందడంతో పాటుగా పోటీతత్వాన్ని అలవర్చు కోవడం జరిగిం దన్నారు. ఉత్సవాలు ఒక రాష్ట్రస్థాయి ఈవెంట్ గా నిర్వహించాలనే సంక ల్పంతో జిల్లా కలెక్టర్ వారు యూనిఫామ్ క్రీడా పరికరాలు వసతి భోజన ఏర్పాట్లు ఘనంగా నిర్వ హించి అందరి మన్ననలు చూరగొన్నారన్నారు రెండు రోజులు పాటు ఎక్కడ అసంతృప్తి కనబడకుండా ఉత్స వాలు సంతోషదాయ కంగా నడిచాయన్నారు. జిల్లా కలెక్టర్ వారి ఆలోచ న విధానం 100% విజయ వంతమైందని తెలిపారు.

కనుమ రుగవుతున్న క్రీడలను తిరిగి పునరుద్ధరించడం హర్షనీయమన్నారు. టోర్నమెంట్ విజయ వంతానికి పాటుపడిన అందరికీ ఆయన ధన్య వాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు సురేష్ కుమార్ ఆర్డీవోలు డి అఖిల, పి శ్రీకర్ డీఎస్ఓ జివిఎస్ సుబ్రహ్మ ణ్యం, పి ఈ టి లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

జిల్లా స్పెషల్ బ్రాంచ్ CI పుల్లారావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట సెప్టెంబర్ 30: డాక్టర్ బి అర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్ బి) సి ఐ గా పుల్లారావు భాద్యతలు […]

అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆనందరావు గారు

టపాసాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి, పర్యావరణాన్ని కాపాడండి, మనమందరం భూమిపై కాలుష్యాన్ని తగ్గిద్దాం: ఎమ్మెల్యే ఆనందరావు తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 19:అమలాపురం నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి […]

పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరం: MLA ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం మార్చి 07, ఆర్థిక భారంతో మందులు కొనలేని పరిస్థితులలో ఉన్న పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరంగా మారాయని […]

నూతన మండల అధ్యక్షుడు మేడిశేటి శ్రీనివాస్ కు అభినందనలు తెలిపిన వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 10: అయినవిల్లి మండలం వైసీపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మేడిశేటి శ్రీనివాస్ కు జర్నలిస్ట్ వినయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. […]