పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతంగా జరగాలి: అమలాపురం RDO

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 26:

పట్టభద్రుల శాసన మండలి పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతం, సజావుగా నిర్వహించాలని స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఆర్డిఓ కె మాధవి పోలింగ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. బుధవారం వెచ్చవారి అగ్రహారం లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నందు పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ గురువారం నిర్వహించ నున్న ఉమ్మడి ఉభయ గోదా వరి జిల్లాల శాసనమండలి పట్ట భద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబం ధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ సామాగ్రిని పోలింగ్ సిబ్బందితో తర లించినట్లు తెలిపారు.

పోలింగ్ సామాగ్రి అయిన బ్యాలెట్ బాక్సులు, ఓటర్ జాబితా మార్కుడు కాపీలు, వరుస క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్ల వివరాల చా ర్టులు, బ్యాలెట్ పత్రాలు, ఇoడేలిబుల్ ఇంక్, స్కెచ్ పెన్లు, చాలెంజ్, టెండర్ ఓట్ల పత్రాలు, చట్టబద్ధమైన కవర్లు, చట్టబద్ధం కానీ కవర్లు, వాటి సీళ్ళు తదితర సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ సిబ్బం దికి సామాగ్రిని అం దించి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలింగ్, భద్రత సిబ్బందితో సహా వాహనా లలో తరలించడం జరిగిందని ఆమె తెలిపారు. డివిజన్ పరిధిలో 45 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పోలింగ్ నిర్వ హణకై 5 జోన్లుగా విభజించి 5 సెక్టార్లను ఐదు రూట్లను ఏర్పాటు చేయడం జరి గిందన్నారు. 45 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ నిర్వ హణకు గాను 270 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు ఆమె తెలిపారు.

పోలింగు ను గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభించేందుకు వీలుగా గురువారం తెల్ల వారుజామునే సిట్టింగ్ ఏర్పాట్లు, పోటీలోని అభ్య ర్థుల జాబితాల చార్టు లు ప్రదర్శన రహస్య ఓటింగ్ కు భంగం వాటిల్లకుండా ఓటింగ్ కంపార్ట్మెంటు వంటి అన్ని ఏర్పాట్లు ముందుగానే పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకుని గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించి విజయవంతం గావించాలని సూచించారు ఈ కార్యక్ర మంలో స్థానిక తహసిల్దార్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

అట్రాసిటీ కేసుల్లో బాధితుల రక్షణ, దోషులకు శిక్షలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24: అట్రాసిటీ కేసుల్లో బాధితుల రక్షణ, దోషులకు శిక్షలు, బాధితుల పునరావాసంతో పాటుగా సత్వర న్యాయా నికి చర్యలు చేపడుతూ చట్టాలు […]

మానవజాతి మనుగడకే ప్రాణం పోసిందే మగువ: అచ్చెన్ననాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం మార్చి 08 : మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువని మహిళా సాధికారత తోనే స్వర్ణాంధ్ర@2047 సాధ్య పడుతుందని రాష్ట్ర వ్యవ సాయ సహకార […]

రాజ్యాంగం అంటే స్వేచ్ఛా భారతం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 26: స్వేచ్ఛా భారతంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని వ్వాలన్న సంకల్పంతో రాజ్యాంగ రచన జరి గిందని జిల్లా కలెక్టర్ […]