- మంత్రివర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలి
- వామపక్ష దళిత ప్రజా సంఘాల డిమాండ్

అధికార మదంతో అడుగడుగునా కుల వివక్షతతో సాక్షాత్తు పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవహేళన చేసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మతోన్మాదం మదమెక్కిన దేశద్రోహి అని తక్షణం కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని వామపక్ష దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ 10 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్ష దళిత ప్రజా సంఘాలు నిరసన ధర్నా నిర్వహించారు అమిత్ షా డౌన్ డౌన్ కాబట్టి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష దళిత ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి కేంద్ర హోం మంత్రిగా గద్దెనెక్కిన అమిత్ షా అడుగడుగునా మతోన్మాదంతో కుల ఉన్మాదంతో ఉద్దేశపూర్వకంగా నవ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని భారత రాజ్యాంగాన్ని అవమాన పరచడమేనని ఆరోపించారు. అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా అమిత్ షా మాట్లాడితే ప్రధానమంత్రి మోడీ వత్తాసు పలకడంలో ఆంతర్యమేమిటని ఇది చాలా అన్యాయమని అన్నారు భారత రాజ్యాంగాన్ని అనుసరించే దేశంలో పరిపాలన జరుగుతుందా లేక మీ సొంత అజెండానా అని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మూడవసారి గద్దెనెక్కిన ఎన్ డి ఏ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రద్దు రద్దు చేయాలని ఆలోచనతోనే అంబేద్కర్ గారిని అవమానిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అమిత్ షా వాక్యాలపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం దారుణమని అన్నారు ఇప్పటికైనా అమిత్ షా కేంద్రమంత్రి నుండి బర్త రఫ్ చేయాలని దేశ ప్రజలకు అమిత్ క్షమాపణలు చెప్పాలని అంబేద్కర్ పై షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డాక్టర్ అంబేద్కర్ జోలికొస్తే కబడ్దార్ అంటూ డిమాండ్ చేశారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు అందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు దళిత ఐక్యవేదిక కన్వీనర్ జంగా బాబురావు కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు సిపిఐ జిల్లా కార్యదర్శి కే సత్తిబాబు పి డి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు గెడ్డం సురేష్ బాబు బి ఎస్ పి ఇన్చార్జ్ పొలమూరి మోహన్ బాబు ఐద్వా కార్యదర్శి టి నాగ వరలక్ష్మి శెట్టిబత్తుల తులసిరావు గోగి మురళి మోకా శ్రీను పృథ్వీరాజ్ లావణ్య దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు