
బేడ (బుడ్గ)జంగాల పోరాటానికి అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ హామీ
- ఎస్సీ జాబితాలో చేర్చుతూ పార్లమెంటు తీర్మానం చేసేలా కృషి చేస్తా
- ఈ కులాన్ని ఆన్ లైన్ లో చేర్చేలా సీఎంతో మాట్లాడతా
- రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ హామీ
- జవహర్ కు బేడ (బుడ్గ) జంగాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ ఘన సన్మానం



V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమండ్రి జూలై 13:

రాష్ట్రంలోని బేడ (బుడ్గ) జంగాలకు ఎస్సీలకు ఉన్న బెనిఫిట్స్ అన్నీ వర్తించే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ బేడ( బుడ్గ )జంగం హక్కుల పోరాట సమితి రాజమండ్రి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్ ఫంక్షన్ హాలులో ఆత్మీయ సమ్మేళన సత్కారం ఘనంగా జరిగింది.ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా బిబిజె ఆధ్వర్యంలో అద్భుతమైన రీతిలో జవహరుకు స్వాగత ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర పర్యాటక ,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడిన వక్తలు బేడ బుడ్గ జంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను జవహర్ దృష్టికి తీసుకు వచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం జవహర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం బేడ బుడ్గ జంగాలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కులాన్ని ఆన్ లైన్ లో తిరిగి చేర్చేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని ఆయన చెప్పారు.వీరిని ఎస్సీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంటు లో కూడా చేయించేలా కృషి చేయాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని ఇప్పటికే కోరినట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలన్నీ పరిష్కారించడానికి తన వంతు కృషి చేస్తానని జవహర్ హామీ ఇచ్చారు.అంతకు ముందు మాట్లాడిన బేడా బుడ్గ జంగాల నాయకులు కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడంవల్ల వృద్ధాప్య పింఛన్లు, వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.పిల్లలు చదవుశకోడానికి కూడా అవకాశం ఉండడం లేదని ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన చెందారు.కార్యక్రమంలో పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు, తూర్పుగోదావరిజిల్లా అధ్యక్షుడు వీర్లపల్లి యేసు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు మోటూరి సింహాచలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పేర్ల దుర్గా ప్రసాద్,ఎ.పి.గౌరవాధ్యక్షుడు మోటూరి రాము, కేంద్ర అధ్యక్షుడు కోడిగెంటి నర్సింహులు, తెలంగాణ అధ్యక్షుడు కడమంచి సహదేవుడు,బైలుపాటి రామకృష్ణ, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు నిండుకొండ శంకర్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఊర లత, టీడీపీ ఎస్సీ సెల్ నాయకురాలు ఖండవల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.