రామచంద్రపురం 22 డిసెంబర్, ప్రజా ఆయుధం :: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో డిసెంబర్ 22 న ఉదయం 8 గంటలకు మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక మంత్రి సుభాష్, జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ విచ్చేశారు. ఈ వైద్య శిబిరానికి అమృత రక్ష హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మడక రాంబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో విశాఖపట్నం కి చెందిన మహాత్మా గాంధీ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, పవర జంక్షన్ “ట్రినిటీ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్స్” ఆధ్వర్యంలో వైద్యులు పాప్స్ మీర్, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, జనరల్ మెడిసిన్స్ పై పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే పిఠాపురం సిఎంసి కంటి ఆసుపత్రి, దృష్టి హాస్పిటల్ సౌజన్యంతో రోగులకు క్యాటరాక్ట్ పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు అందజేశారు. హాసిని డెంటల్ డాక్టర్ తన్మయ్ రోగులకు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, పేస్టులు అందించారు. ఈ వైద్య శిబిరానికి అవసరమైన టానిక్కులు, మందులను సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్, ట్రినిటీ హాస్పిటల్స్, లక్ష్మీ ఆప్టికల్స్, శ్రీ ప్రియ స్వీట్స్ వారు సరఫరా చేశారు. ఈ మెగా వైద్య శిబిరానికి రిక్కీ గూటం ముఖ్య సంధాన కర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిర్రా రాజకుమార్, తడాల లోవరాజు, తిరంశెట్టి సత్యనారాయణ, ద్రాక్షారామ భీమేశ్వర డెంటల్ హాస్పిటల్ డాక్టర్ క్రాంతి కుమార్, తాడల రాజు, కోటిపల్లి వీరవేంద్ర ప్రసాద్, కోటిపల్లి హరీష్ ఇంకా జనసైనికులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఊడిమూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం
December 22, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం : ఎంపీ హరీష్ బాలయోగి
మానసిక ఒత్తిడికి యోగా సరైన మార్గం… V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19: ప్రతి మనిషి తన జీవితంలో పడే మానసిక ఒత్తిడికి యోగా సరైన మార్గం […]
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పై ఎస్సీ కమిషన్ చైర్మన్ సీరియస్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఎస్సి కమిషన్ కార్యాలయం కొవ్వూరు , జూన్ 12: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసును ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ […]
కపిలేశ్వరపురం ఎంపిపి అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి రాజీనామా!
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మండపేట సెప్టెంబర్ 30కపిలేశ్వరపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు తన పదవికి సోమవారం రాజీనామా చేసారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ […]
ప్రజా వేదిక కార్యక్రమం ప్రభుత్వ విప్ దాట్ల మాట్లాడుతూ…
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కాట్రెనికోన మే 31: ప్రజా వేదిక లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు […]