ప్రజా వేదిక కార్యక్రమం ప్రభుత్వ విప్ దాట్ల మాట్లాడుతూ…

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కాట్రెనికోన మే 31:

ప్రజా వేదిక లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు మాట్లాడుతూ, పేదల సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరు ఎప్పుడూ ఆదర్శం అన్నారు. పేదల సేవలో – ప్రజా వేదిక కార్యక్రమం కాట్రెనికోన మండలం చెయ్యరు గ్రామంలో చేపట్టడం పట్ల కృతజ్ఞతలు గ్రామ ప్రజలు తరపున వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులను విడుదల చెయ్యడం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వివరాలు తెలియ చేస్తూ, జలజీవన్ మిషన్ కింద రూ.18 కోట్లతో చెరువుల అభివృద్ధి, పైపు లైన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మత్స్య కార భరోసా కింద ఇస్తున్న రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని రూ.20 వేలకు పెంచి రూ.24  కోట్ల రూపాయల  అందచేశామన్నారు. ఓ ఎన్ జీ సీ ద్వారా మత్స్య కార కుటుంబానికి ఒకొక్కరికి రూ.63,963 లు చొప్పున రూ.133 కోట్ల పరిహారం అందించడం జరిగిందన్నారు. సీఎం సహాయ నిధి కింద 175 మందికి రూ.16 కోట్ల 70 లక్షల ఆర్థిక సహాయం, వెనుకబడిన వర్గాల మహిళల కోసం 10 శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా 1400 మహిళలకి ఉచిత శిక్షణ కుట్టు మిషన్లు, 40 గోశాలాలు , రూ.3 కోట్లతో నీటి తొట్టెల నిర్మాణం, పల్లంకుర్రు, నగర పంచాయతీ లలో రూ.6.75 కోట్లతో రెండు సబ్ స్టేషను కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియ చేశారు. ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అలుపెరగని యోధులు గా మీరు ఎప్పుడూ మాకు ఆదర్శం అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు దిశగా అడుగులు వేయడం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

ఆక్వా సాగు చెయ్యడం బోడసుకుర్రు చెరువు  నిర్వీర్యం అయి నిరుపయోగంగా మారిందని, గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.18 కోట్లతో అభివృద్ధికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. అయితే ఎన్నికల తర్వాత గత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వైఖరి వలన పనులు చేపట్టలేదన్నారు. ఈ చెరువును అభివృద్ధి చేయడం వల్ల ఈ నియోజకవర్గం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యకి పరిష్కారం కానుందని తెలిపారు. ఆ పనులు చేపట్టాలని, ఇంకా పూర్తి కావలసి ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని శాసన సభ్యులు కోరారు. ఉపాధిహామీ కూలీలతో మమేకం అవ్వడం, సమస్యలను పరిష్కారం కోసం తీసుకున్న చర్యలపై గ్రామ ప్రజలు తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు

Related Articles

ఏపీ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీ

ఏపీ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీ. ఈ పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధులు నిర్వహించుటకు పోస్టులను భర్తీ చేయనున్నారు. 👉అర్హత :డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా […]

మంత్రి సుభాష్ ఔదార్యం !పండగ చేసుకోండి మిత్రులారా !

ఏరియా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి సంక్రాంతి కానుక రూ.65₹ వేలు ఇచ్చిన మంత్రి సుభాష్ పండుగ అంటే.. ప్రతి ఇంట్లోనూ సందడే.. అందులోనూ తెలుగు వారికి అతి ప్రీతిపాత్రమైన సంక్రాంతి అంటే ఎంత సందడో..ఇష్టమో […]

మర్యాదపూర్వకంగా పెద్దలను కలిసిన మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 09: అయినవిల్లి మండలం వైసీపీ అధ్యక్షుడుగా మేడిశెట్టి శ్రీనివాస్ నియమితులయ్యారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం, […]

ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి గెలుపు కోరుతూ ఎంపీ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 22:రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోరుతూ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ […]