•వైసిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రామచంద్రపురం డిసెంబర్ 21:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను, వాగ్దానాలను గాలికి వదిలేసిందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీ ఇన్చార్జ్ యువ నాయకుడు పిల్లి సూర్య ప్రకాష్ అన్నారు. వైసిపి నేత సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణ వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియా సమక్షంలో పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడారు. కూటమి అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల మాట పూర్తిగా మరిచారని అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటిని పూర్తిగా నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లారని సూర్య ప్రకాష్ గుర్తు చేశారు. అందుకు విరుద్ధంగా నేటి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను తుంగలోకి తొక్కిందన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి ఈ అన్యాయాలను చూస్తూ ఊరుకోదని, ప్రజల కోసం తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు,కార్యకర్తలు అంతా రోడ్డెక్కి పోరాటం చేస్తారని ఆయన హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం గుదిబండలా మారిందని పిల్లి సూర్య ప్రకాష్ ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలివచ్చి వేడుక జరుపుకున్నారు. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విచ్చేసిన వైయస్సార్ అభిమానుల మధ్య సూర్య ప్రకాష్ భారీ కేకును కట్ చేసారు. హ్యాపీ బర్త్డే టూ జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాల మధ్య కార్యకర్తలకు, నాయకులకు కేకును పంపిణీ చేసి పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్ కోలమూరు శివాజీ, రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, వైస్ ఎంపీపీ శాఖా బాబీ, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, పెట్టా శ్రీనివాసరావు, పండు గోవిందరాజులు, ఇంత సంతోషం, పెంటపాటి శ్రీనివాసరావు, వాసంశెట్టి శ్యామ్, మున్సిపల్ కౌన్సిలర్లు నల్లా అంజమ్మ, కేతా శ్రీనివాసు,పోతంశెట్టి గోపాలకృష్ణ సూరంపూడి రాంబాబు,వైసీపీ నాయకులు కంచి సత్యానందం, పోలినాటి ప్రసాద్, యల్లమిల్లి సతీష్ కుమారి, ఎల్ఐసి మస్తాన్, పలువురు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.