
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 26:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
మండపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. సభర్నెట్ కమిటీ ప్రభుత్వ విధానాలు, ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన రాజకీయ అనుభవాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. సభర్నెట్ కమిటీ చైర్మన్‌గా, తోట త్రిమూర్తులు ప్రభుత్వ నూతన విధానాలు, ముఖ్యమైన నిర్ణయాల అమలులో సమన్వయకర్తగా, నిర్ణయాధికారిగా కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.