


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 01:

ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థకు మంచి పేరు తెచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రేషన్ డీలర్లను ఆదేశించారు. ఆదివారం స్థానిక అమలాపురం రెండో వార్డ్ లోని నల్ల వీధిలో 18 వ చౌక ధరల దుకాణాన్ని పండుగ వాతావరణంలో గతంలో మాదిరిగా నిర్వహించేలా పున: ప్రారంభించి సీనియర్ సిటిజనులకు రేషన్ అందించే ప్రక్రియను ఈపిఓ మిషన్లో ద్వారా రసీదులు అందించి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సరైన తూనికలు కొలతలతో నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని వినియోగ దారుల వ్యవహారాల ఆహార పూర్ సరఫరాల శాఖ నిర్దేశించిన ధరలు, స్టాక్ బోర్డులను సరైన విధంగా షాపు ముందు భాగంలో ప్రదర్శించి ఆ ప్రకారం విక్రయాలు నిర్వహించాలన్నారు.

చౌక ధరల దుకాణాల నుంచే కార్డు దారులకు రేషన్ అందించే పాత విధానాన్ని రాష్ట్ర ప్రభు త్వం పునరుద్ధరించి తిరిగి అమల్లోకి తెచ్చిందన్నారు. స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు రేషన్ కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభు త్వ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నిత్యావసర సరుకులు పారదర్శకంగా జవాబు దారీతనంతో పంపిణీ చేయాలని డీలర్లకు సూచిం చారు రేషన్ దుకాణాలను పునః ప్రారంభించి కార్డుదారులకు నిత్యవ సర వస్తువులు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాం టి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పూర్వపు పద్ధతుల్లోనే నిత్యవసర సరుకుల పంపిణీ విధానాన్ని రేషన్ కార్డుదారులు స్వాగతి స్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

నిర్దిష్ట సమ యాలలో రేషన్ పంపిణీ చేయడం రేషన్ కార్డు దారులకు ఊరటను ఇస్తుందన్నారు దివ్యాం గులు, 65 ఏళ్లు పై బడి వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు చొరవ చూపా లన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి మాట్లాడుతూ జిల్లాలో 926 చౌకదారుల దుకా ణాలకు సంబంధించి5 లక్షల 37 వేల మంది కార్డుదారులు ఉన్నార న్నారు. కార్డుదారులు తమకు అనుకూలమైన సమ యాలలో రేషన్ డిపోలకు వెళ్లి సరుకు లను పొందవచ్చు నన్నారు.

వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటిక ప్పుడు సమాచారం అందిస్తూ కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడా లన్నారు ఒక వేళ ఎప్పు డైనా సాంకేతిక సమస్య లు ఉత్పన్నమైన సరే కార్డుదారుల ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం ద్వారా సరుకుల పంపిణీ చేయాలన్నారు.

ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణం గా వ్యవస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధం గా రేషన్ డీలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ధరలు, స్టాకు వివరాలు తెలిపే బోర్డులను ప్రద ర్శించాలన్నారు.చౌక ధరల దుకాణాల నుంచే కార్డు దారులకు రేషన్ అందించే పాత విధా నాన్ని ప్రభుత్వం పున రుద్ధరించి ఆదివారం నుండి తిరిగి అమల్లోకి తెచ్చిందన్నారు ఈ మేరకు డీలర్లను సన్నద్ధం చేసి ప్రతి నెల 1 నుంచి 15 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయం త్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణా ల్లోనే సరుకులు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు గైకొందన్నారు.

ఈ 15 రోజుల్లో ఆదివారాల్లో కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని. కార్డు దారులు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఎప్పుడు కావలిస్తే అపుడు వెళ్లి రేషన్ పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే మాధవి జిల్లా పౌరసరఫ రాల అధికారి ఏ ఉదయ భాస్కర్ మున్సిపల్ అధికారిని రాణి, తాసిల్దార్ అశోక్ కుమార్ అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయు డు, మెట్ల రమణబాబు కౌన్సిలర్లు డీలర్లు పాల్గొ న్నారు.