V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆత్రేయపురం డిసెంబర్ 21:

అఖండ గోదావరి నది ప్రాంతం ప్రకృతి అందాలు, రమణీయత మధ్య ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులను కను విందు చేస్తోoదని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక మండల పరిధిలోని లొల్ల లాకులు వద్ద కోనసీమ సంక్రాంతి సంబరాలు పేరిట జనవరి 11, 12, 13 తేదీలలో నిర్వహించనున్న ఈతల పోటీలు, గాలిపటాల పోటీలు ముగ్గుల పోటీల సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోపీ కర్ర పత్రాన్ని ఆవిష్కరించి క్రీడా పోటీలను లాంఛనంగా జిల్లా కలెక్టర్ మరియు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావులు ప్రారంభిం చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదా వరి ప్రాంత పచ్చదనం, మనసుకు ఆహ్లాదాన్ని కలి గించే గోదావరి నీటి సమ శీతోష్ణస్థితి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటు oదన్నారు స్థానిక శాసనస భ్యులు ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయనీ ఆ దిశ గా ఈ ప్రాంతం పర్యాటకంగా విరాజిల్లనున్నదని ఆయన అభిలాషించారు సంక్రాంతి పండుగలకు తెలంగాణ ఇతర ప్రాంతాల నుండి పర్యాటకు లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున జనవరి 11, 12, 13 తేదీలలో ఈ ప్రాంత విశి ష్టత కీర్తి ప్రతిష్టలను నలు మూలల వ్యాపింపజేసే దిశగా ఈతల పోటీలు గాలిపటాల పోటీలు ముగ్గుల పోటీలు కోనసీమ సంక్రాంతి సంబ రాలు సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీనీ అత్యంత వైభవోపేతంగా నిర్వహిం చడానికి సంకల్పించామన్నారు.

ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన బహు మతులు ప్రధమ ద్వితీయ తృతీయ శ్రేణులకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆయా రంగాలలో ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ సదవకా శాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుగా తమ తమ పేర్లు నమోదు చేయించు కోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి వారి సిబ్బంది పోలీస్ ఇరిగేషన్ మత్స్య, శాఖలు సమ న్వయంతో ఈ పోటీల నిర్వహణ ఉంటుందన్నారు. అయితే లొల్ల లాకుల వద్ద పర్యాటకుల వసతి వాహ నాల పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఇదొక అద్భుతమైన చక్కటి సదవకాశమని ఆయన తెలిపారు. స్థానిక శాసనస భ్యులు బండారు సత్యా నందరావు మాట్లాడుతూ సర్ ఆర్డర్ కాటన్ మహాశయుడు గోదావరి ప్రాంతాన్ని సస్య శ్యామలంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఈ ప్రాంత అభి వృద్ధికి ఎంతో శ్రమించారని ఆయన నిర్మించిన డెల్టా ఆనకట్టకు అనుబంధంగా ఉన్న లోల్ల లాకులు వద్ద ఆహ్లాదకరంగా పర్యటన ఆకర్షించే విధంగా పోటీలు నిర్వహించడం సంతోషదా యకమన్నారు. లొల్ల లాకులు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి పర్యాటకశాఖ మంత్రివర్యుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఆ దిశగా ఏర్పాటుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు శాసనసభ్యులు తెలిపారు.

ఈ ప్రాంతం ఒక ప్రక్క పచ్చదనం, మరొక పక్కా గోదావరి నీటితో ఆహ్లా దకరంగా ఉండడం వల్ల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు అవకా శాలు ఎక్కువగా ఉన్నా యన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్, ఆత్రే యపురం మండల అధి కారులు స్థానిక ప్రజాప్ర తినిధులు పాల్గొన్నారు.
