

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి అక్టోబర్ 18:
ప్రకృతిని – పరి రక్షిద్దాం పరిసరాల పరిశుభ్రతను పాటిద్దాం,అని పోతుకుర్రు సర్పంచ్ సయ్యపరాజు సుబ్బలక్ష్మి పిలుపునిచ్చారు.
పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం పంచాయతీ సిబ్బంది మరియు దీవెన ఫౌండేషన్ సంయుక్త ఆధ్యర్యంలో స్వచ్చంద్ర – స్వచ్చ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ.. చెత్తను బుట్టలో వేసి శుభ్రతకు తోడ్పడాలన్నారు.
ప్లాస్టిక్ నిర్మూలించి ప్రకృతిని పరి రక్షిద్దామన్నీ పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంలో గ్రామ ప్రజల చేత ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణాన్ని కాపాడితే,అది ప్రజలను కాపాడుతుందన్నారు.కాలుష్యం పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దీవెన ఫౌండేషన్ చైర్మన్ గుమ్మళ్ల శ్రీనివాస్ సాగర్ పేర్కొన్నారు.
అనంతరం పంచాయతీ పరిధిలోని పలు గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మద్దెల రామకృష్ణ, పి.వెంకన్న బాబు,సి హెచ్ త్రిమూర్తులు, సిహెచ్.సత్యనారాయణమూర్తి, పంచాయతీ సిబ్బంది,డ్వాక్రా యానిమెటర్స్, మరియు సభ్యులు ఉపాధి హామీ పథకం సిబ్బంది మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.