V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అయినవిల్లి మే15:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోర్త సత్తిబాబు ఆధ్వర్యంలో రోగులకు బ్రెడ్ పళ్ళు బిస్కెట్లు పంపిణీ చేశారు.గురువారం విలస గ్రామంలోని న్యూలైఫ్ సెంటర్ లో ఎమ్మెల్యే పుట్టినరోజు జరిపారు.ఈ సందర్భంగా నియోజక లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం కావాలని ఆశా భావం వ్యక్తం చేశారు. అనంతరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోర్త సత్తిబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు మరింత ఆరోగ్యం ఆయుష్షు సమకూరాలని కోరారు. నియోజక అభివృద్ధిలో ఆయన తనదయిన ముద్ర వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుమ్మల్ల సాగర్ బడుగు వెంకటేష్ చోడేలోవరాజు పంబల కృష్ణ మద్దా సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు