అమలాపురం ఏరియా ఆసుపత్రి లో జాయింట్ కలెక్టర్ హెచ్చరిక జారీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం సెప్టెంబరు 22 :

హాజరు పట్టిలో సంతకాలు పెట్టి విధులకు గైహాజరు అయిన వైద్యులు వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలు గైకొనడం జరుగు తుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాoతి హెచ్చరించారు సోమవారం స్థానిక ప్రాం తీయ ఆసుపత్రి నందు ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో పలు లోపాలను గుర్తిం చారు. ముఖ్యంగా విధి నిర్వహణలో వైద్యులు గైహాజరు కావడం, ఆసుపత్రిలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించక పోవడం,సక్రమంగా రోగుల కు తగిన సౌకర్యాలు అం దించబడకపోవడం వంటి అంశాలు కనిపించాయన్నా రు హాజరు పట్టీలో సంతకం చేసి విధులకు గైహాజరు అవుతున్న డాక్టర్ల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని మరోసారి ఇలానే పారిశుద్ధ్య పరిస్థితి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి నిర్వహణలో అలసత్వం నిర్లక్ష్యం కనబరచిన సంబం ధిత అధికారులు, సిబ్బంది పై తగిన చర్యలు తీసుకో వాలని ఆదేశించడం జరిగిందన్నారు .రోగులకు సమయానుసారంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తక్షణ సరిదిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి వైద్యుడు విధి నిర్వహణకు కట్టుబడి ఉండేలా పర్యవేక్ష ణ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.సూపరిండెండెంట్, ఆర్వోల పై తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇకపై పనితీరు మార్చు కోవాలని హితవు పలికారు. అన్ని వార్డులు కలియ తిరిగి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ఆరా తీసి వైద్యుల తీరు పట్ల ఆమె తీవ్ర అసం తృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శంక ర్రావు వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related Articles

బేడ బుడగ జంగాల పోరాటానికి అండగా ఉంటా: ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

బేడ (బుడ్గ)జంగాల పోరాటానికి అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ హామీ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమండ్రి జూలై 13: రాష్ట్రంలోని బేడ (బుడ్గ) […]

ట్రాఫిక్ నిభందనలు పాటించాలి: ఎస్ ఐ హరి కోటి శాస్త్రి

ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ నిభందనలు పాటించాలనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట టౌన్ ఎస్ ఐ హరి కోటి శాస్త్రి పేర్కొన్నారు. మండపేట ట్రావెలర్స్ బంగళా వద్ద బుదవారం ఆటో […]

భారతీయుల కోరిక ఉగ్రవాదం నశించాలని: ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ఢిల్లీ మే 26: గయానా దేశంలో అఖిల పక్ష బృందానికి ఘన స్వాగతం పలికిన భారతీయులు… గయానా దేశ ఉపాధ్యాక్షులు భారత్ జిగ్డియో తో […]