డిఆర్ఓ రాజకుమారి అధ్యక్షతన ఎయిడ్స్ నియంత్రణ కమిటీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం జూలై 30:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ చర్య ల అన్ని పారామీటర్లలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పథక సంచాలకులు డాక్టర్ కె.నీలకంఠారెడ్డి హెచ్ఐవి ఎయిడ్స్ నియం త్రణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ సమావేశం డిఆర్ఓ రాజకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పథక సంచాలకులు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ చట్టం 2017 హెచ్ఐవి తో బాధపడే వారికి రక్షణ కవచం అన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన దిశగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రత్యేక చొరవ తీసు కొని నిర్దేశిత పారామీటర్లలో ప్రగతిని సాధిస్తూ జిల్లాను ఎయిడ్స్ నియంత్రణ చర్యలలో ముందంజలో నిలపాలని సూచించారు హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలింగ్ పరీక్షా కేంద్రాల నిర్వహణ సుఖ వ్యాధులు నివారణ ఏరియా ఆసుప త్రులలో లైంగిక వ్యాధుల క్లినిక్లు, ఏఆర్టీ కేంద్రాలు నిర్వహణ సేవలను మరింత బలోపేతం చేస్తూ నివారణా చర్యలను పక్కగా నిర్వహించాలని ఆదేశించారు.

హెచ్ ఐ వి రహిత రక్త మార్పిడి చర్య లు ఏఆర్టీ కేంద్రాలు అను బంద లింక్ ఎఆర్టి ప్లస్ మరియు లింకు ఎఆర్టి కేంద్రాల ద్వారా ప్రతినెల ఎటువంటి గ్యాపులకు ఆస్కారం లేకుండా ఉచితంగా మందులు పంపిణీ జరగాలన్నారు జిల్లాలో ప్రతి మూడు నెలలకు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి నియంత్రణ చర్యలను బలోపేతం చేస్తూ వ్యాధి వ్యాప్తిని అరికడుతూ మరణాల రేటును తగ్గిం చాలన్నారు.జిల్లా కొన్ని పారామీటర్లలో వెనుకం జలో ఉందని, మెరుగైన పనితీరును కనబరుస్తూ వ్యాధుల నియంత్రణలో పురోగతిని సాధించాలని ఆయన స్పష్టం చేశారు.

నూతనంగా జన్మించిన బిడ్డలకు హెచ్ఐవి రాకుం డా గర్భిణీ స్త్రీల విషయంలో గర్భం దాల్చిన నాటి నుండి అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ చర్యలను పక్కాగా చేపట్టాలన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ నియం త్రణ కేంద్రాలలో వివక్షతకు తావు లేకుండా మానవతా దృక్పథంతో సేవలందించి మానిటరింగ్ టూల్స్ లో అభివృద్ధి సాధించాలన్నారు జిల్లా వ్యాప్తంగా తరచుగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహి స్తూ నియంత్రణ చర్యలను చేపట్టి వ్యాధి తీవ్రత ప్రమా దకరంగా మారకుండా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్ని సేవలలో మెరుగైన పురోగతిని జాబ్ చార్ట్ కు అనుగుణంగా చేపట్టి వివ క్షతకు తావు లేకుండా మా నవతా కోణంలో వ్యవహరి స్తూ వ్యాధుల బారి నుండి బాధిత వర్గాలకు సంపూర్ణ రక్షణ కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అందుబా టులో ఉన్న సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తూ వ్యాధి నియంత్రణ చర్యలు పటిష్టంగావించాలన్నారు వీఆర్వో రాజకుమారి మాట్లాడుతూ ఏ ఆర్ టి కేంద్రాలలో జీవితకాలం మందులను ఉచితంగా అందిస్తారని మందులు క్రమం తప్పకుండా వాడించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు అలాగే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వ్యాయామం క్రీడల ద్వారా ఆరోగ్యమైన జీవనాన్ని పొందే విధానంపై అవగాహన పెంపొందించా లన్నారు. ప్రతి ఐసీటీసీ కేంద్రాలలో హెచ్ఐవి పరీక్షతోపాటు తగిన సూచనలు సలహాలు ఉచిత సేవలకు సంబం ధించిన సమాచారాన్ని బాధిత రోగులకు అందిం చాలన్నారు. వివిధ రకాలుగా సోకే వ్యాధి సంక్రమణాన్ని పూర్తిగా నివారించాలన్నారు. అదనపు ప్రాజెక్టు సంచాలకులు కామేశ్వర ప్రసాద్ జిల్లాకు సంబంధించి వివిధ పారామీటర్ల వారీగా నియంత్రణ చర్యల పురోగ తిని సిబ్బంది ద్వారా సమీ క్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సలీం భాషా మా ట్లాడుతూ యుక్త వయసు నుండే హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ చర్యల పట్ల పూర్తి అవగాహనను పెంపొందించాల్సిన అవ సరం ఉందన్నారు ట్రాన్స్ జెండర్స్, రక్త మార్పిడి, ఇంజక్షన్ సూదులు విచ్చ లవిడి శృంగారం వంటి వాటి ద్వారా వ్యాధి సం క్రమణకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. ఈ అంశాలపై పూర్తి అవగాహనను సమా జంలో పెంపొందించాలన్నా రు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో దుర్గారావు దొర, డి సి హెచ్ ఎస్ కార్తీక్, అదనపు డి ఎం అండ్ హెచ్ ఓ, జిల్లా ఎయిడ్స్ నియం త్రణ అధికారిని సిహెచ్ వి భరత లక్ష్మి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకండి; కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 26: ప్రజలు మత్తు పదార్థాల కు అలవాటు పడ్డారంటే ఆ సమాజం తిరోగమనం లో పయనిస్తోందని ఆ లాంటి చోట సామాజిక, […]

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రభుత్వం స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 10: రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల కల్పనకు సంబంధించి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించడం, సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, అనుమతులు […]

లంక గ్రామాలలో స్వామి వివేకానంద ట్రస్ట్: ఘనంగా జయంతి వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ముమ్మిడివరం జనవరి 14: లంక గ్రామాలలో స్వామి వివేకానంద ట్రస్ట్ సేవలు అభినందనీయం.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం […]

ఎమ్మెల్యే గిడ్డి ఆదేశాలతో ఎమ్మార్వో నాగలక్షమ్మ అధ్యక్షతన ప్రభల తీర్థం కమిటీ.

అయినవిల్లి మండలం అయినవిల్లి ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 ని” ప్రభల తీర్థం కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహిస్తారు, సమావేశానికి ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు మరియు ఆసక్తి గలవారు హాజరుకావాలని […]