ముగిసిన ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇక తాజాగా రెండో రౌండ్, మూడో రెండ్​లో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్‌లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేట్ అయ్యారు.తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసులుకు 7,210 ఓట్లు, కూటమి, ఏపీటీఎఫ్‌ మద్దతు అభ్యర్థి రఘువర్మకు 6,845 ఓట్లు వచ్చాయి. అదే విధంగా యూటీఎఫ్‌ అభ్యర్థి విజయగౌరి 5,804 ఓట్లు సాధించారు. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు.

రెండు, మూడు రౌండ్లలో పలువురు ఎలిమినేట్​ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్‌లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేషన్ అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం ఆరు రౌండ్లు ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలిస్తారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి శ్రీనివాసులు 7,230, రఘువర్మ 6,859 ఓట్లు సాధించారు.

Related Articles

భవన ఇతర నిర్మాణ యువ కార్మికులకు పీఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి07:భవన, ఇతర నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికుల కు చెందిన 21-24 మధ్య వయస్సు గల పిల్లలకు పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ రిజిస్ట్రే […]

V9 ప్రజా ఆయుధంమీడియా అధినేత కుటుంబం లో జ్ఞాపకార్థ కూడిక. స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 27: V9 మీడియా అధినేత కుటుంబం లో జ్ఞాపకార్థ కూడిక కు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు. నేరేడుమిల్లి పురుషోత్తముడు జ్ఞాపకార్థ […]

పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరం: MLA ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం మార్చి 07, ఆర్థిక భారంతో మందులు కొనలేని పరిస్థితులలో ఉన్న పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరంగా మారాయని […]

సమాజ నిర్మాణం|సమానత్వం లో స్త్రీ సగభాగం| అసాంఘిక బాల్య వివాహాలను నిరోధించాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 07: సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాoతి అన్నారు. శుక్రవారం స్థానిక […]