
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూన్ 01:
పలు ఆసుపత్రుల్లో ఇటీవల వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 17 మందికి రూ.13 .08 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ చెక్కులను ఆదివారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట టిడిపి కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.