ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించుకుందాం:మంత్రి తండ్రి వాసంశేట్టి సత్యం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జనవరి 26 :రానున్న ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ కు అఖండ విజయం చేకూర్చేందుకు ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు, టీచర్లు అన్ని వర్గాల వారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ విజయం అందించారని, అదే వరవడితో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుంది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ తన విజయానికి మద్దతుగా 12 ఉద్యోగ,ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక సంఘాలు నిలిచాయని వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులకు పేరాబత్తుల రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

చలో గుంటూరు మాల సభా వేదిక పై ముగించిన పరిచయం

వర్గీకరణకు వ్యతిరేకంగా చలో గుంటూరు మాల మహా గర్జన సభా ప్రారంభం లో సభా వేదికపై ఆంధ్ర తెలంగాణ మాల మహానాడు నాయకులు మరియు మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను పరిచయం చేశారు. […]

గుత్తుల సాయి గారు ను మర్యాదపూర్వకంగా కలిసిన V9 మీడియా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ముమ్మిడివరం జూలై 21: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం నుంచి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా […]

దళిత యువకుడిపై దాడి అమానుషం:

తమ రాజకీయ కుల దురహంకారంతోనే మండలంలోని వెలువలపల్లికి చెందిన దళిత యువకుడు దోనిపాటి మహేశ్వరరావుపై దాడి జరిగినట్లు మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ తెలిపారు.ఈ విషయమై మానవ హక్కుల వేదిక […]