

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 13:

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చిన అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై వుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం అమలాపురం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారుగా 110 అర్జీలను జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి, డిఆర్ఓ కే మాధవి డ్వామా పిడి మధుసూదన్ లు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో సం బంధిత అధికారి మర్యా దగా ప్రవర్తించాలని, ఎండార్స్మెంట్ తప్పకుండా ఇవ్వాలని తెలిపారు. వ్యవహార శైలి, పరిష్కార సరళి, విధానం సరిగ్గా లేదన్న అభిప్రాయం అర్జీదారుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ రాకూడదని ఆయన స్పష్టం చేశారు. రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టిసారించి, త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. గడువు దాటిన అర్జీలు లేకుండా సకాలంలో క్షేత్ర స్థాయిలో విచారించి పరిష్కరించాలన్నారు.

అన్ని అంశాలకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో సం తృప్తకర స్థాయిని పెంచాలన్నారు. విజన్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నియోజక వర్గ దార్శనిక కార్యాచరణ ప్రణాళిక యూనిట్ క్రియా శీలతకు సమిష్టిగా కృషిచే యాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ తో పాటు కీలక ప్రగతి సూచికల సాధనకై కూడా దృష్టి సారించాలని సూచిం చారు. అర్జీలన్నింటిని క్షుణంగా పరిశీ లించి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ డిఇఓ షేక్ సలీం భాష జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఏవీఎస్ రామన్, డి ఈ పద్మనాభం డీఎస్ఓ ఏ ఉదయభాస్కర్, జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకట్రావు, ఎండిఎం కేశవ వర్మ ఆర్ అండ్ బి ఎస్ సి బి రాము, డి ఎఫ్ ఓ , ఎం వి. వి ప్రసాదరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి పి వీ శ్రీనివాసరావు, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్, వివిధ శాఖలకు చెందిన అధికా రులు పాల్గొన్నారు.